iDreamPost
android-app
ios-app

చిన్న కూతురు చేసిన తప్పుకు పెద్ద కూతుర్ని శిక్షించిన తండ్రి!

  • Published Oct 12, 2023 | 7:26 PM Updated Updated Oct 12, 2023 | 7:26 PM
  • Published Oct 12, 2023 | 7:26 PMUpdated Oct 12, 2023 | 7:26 PM
చిన్న కూతురు చేసిన తప్పుకు పెద్ద కూతుర్ని శిక్షించిన తండ్రి!

21వ శతాబ్ధంలోనూ ప్రేమ పెళ్లిలకు కొందరు పెద్దలు నో చెబుతున్నారు. కుల, మత, ఆర్థిక స్థోమతలను దృష్టిలో పెట్టుకుని సింపుల్‌గా ప్రేమ పెళ్లిళ్లకు నో అనేస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు తమకు ఎదురు తిరిగి పెళ్లి చేసుకుంటున్న పిల్లలపై దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా, కర్ణాటకలో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. చిన్న కూతురు చేసిన తప్పుకు పెద్ద కూతుర్ని శిక్షించాడో ఓ వ్యక్తి. ఇంట్లో నిద్రపోతున్న ఆమె గొంతు కోసి చంపాడు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరు రూరల్‌ జిల్లా, దేవనహళ్లి తాలూకా, బిదలుర్‌ గ్రామానికి చెందిన మంజునాథ్‌ చికెన్‌ షాపు నిర్వహిస్తున్నాడు. ఇతడికి ఇ‍ద్దరు కూతుర్లు ఉన్నారు. చిన్న కూతురు మంగళవారం ప్రియుడితో ఇంటినుంచి పారిపోయింది. పోలీసులను ఆశ్రయించి ప్రియుడితో పెళ్లి జరిపించమని కోరింది.  ఈ విషయం తెలిసిన మంజునాథ్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చిన్న కూతురు కారణంగా ఊర్లో తన పరువు పోయిందని బాధపడుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పెద్ద కూతురు కవన కూడా ప్రేమలో ఉందని తెలిసింది.

దీంతో మంజునాథ్‌ తట్టుకోలేకపోయాడు. పెద్ద కూతురి వల్ల కూడా తన పరువు పోయే అవకాశం ఉందని భావించాడు. చిన్న కూతురు చేసిన తప్పుకు పెద్ద కూతుర్ని శిక్షించాలని నిశ్చయించుకున్నాడు. అర్థరాత్రి కవన నిద్రపోతున్న సమయంలో ఆమె దగ్గరకు వెళ్లాడు. చికెన్‌ కోసే కత్తితో ఆమె గొంతు కోసి చంపేశాడు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş