iDreamPost
android-app
ios-app

ర్యాగింగ్ రక్కసికి బలైన డిగ్రీ విద్యార్థి!

  • Published Oct 05, 2023 | 7:48 PM Updated Updated Oct 05, 2023 | 7:48 PM
ర్యాగింగ్ రక్కసికి బలైన డిగ్రీ విద్యార్థి!

ఒకప్పుడు కాలేజీల్లో ర్యాగింగ్ కల్చర్ తో ఎన్నో అనర్ధాలు జరిగాయి. ప్రభుత్వాలు, కాలేజీలు ర్యాగింగ్ కి పాల్పపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కొత్త చట్టాలు తీసుకు రావడంతో వేధింపులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. అయితే అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఎంత వార్నింగ్ ఇచ్చినా.. కాలేజీల్లో అక్కడక్కడ ర్యాగింగ్ కల్చర్ కొనసాగుతూనే ఉంది. తాజాగా ర్యాగింగ్ భూతానికి ఓ డిగ్రీ విద్యార్థి ప్రాణాలు బలయ్యాయి. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కాలేజీలో కొత్తగా చేరిన విద్యార్థులను సీనియర్లు ఆటపట్టిస్తుంటారు. అది కొంత వరకు సరదాగా ఉంటే ఓకే.. కానీ ర్యాగింగ్ పేరుతో మితిమీరి ప్రవర్తించడం వల్ల జూనియర్లు తీవ్ర ఇబ్బందులకు గురైతుంటారు. కొంతమంది మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలకు పాల్పపడటం చూస్తున్నాం. తెలంగాణలో కొంత కాలంగా ర్యాగింగ్ కల్చర్ మళ్లీ మొదలైంది. ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థులు దాడి చేయడంతో డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది.

మంచిర్యాల జిల్లా పొన్నారం గ్రామంలో ఎస్సీ హాస్టల్ లో కామెర ప్రభాస్ అనే విద్యార్థి బీకాం కంప్యూటర్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం ప్రభాస్ పై తోటి విద్యార్థులు ర్యాగింగ్ చేస్తూ ఆటపట్టించారు. అది కాస్త శృతి మించి విద్యార్థిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రభాస్ ని హాస్టల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళ చేపట్టారు. ప్రభాస్ పై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.