iDreamPost

మార్కెట్ లోకి కొత్త స్కామ్! మీ అకౌంట్ లోకి డబ్బులు వేసి మరీ ముంచేస్తారు!

  • Published May 11, 2024 | 6:07 PMUpdated May 11, 2024 | 6:07 PM

ప్రస్తుతం మార్కెట్ లోకి కొత్త తరహా స్కామ్ అనేది జరుగుతంది. అయితే ఈ స్కామ్ పేరు స్మిషింగ్ ఎటాక్ స్కామ్. మరి, ఈ స్కామ్ గురించి, దీని నుంచి జాగ్రత్తపడే వివరాలను ఇప్పుడు తెలసుకుందాం.

ప్రస్తుతం మార్కెట్ లోకి కొత్త తరహా స్కామ్ అనేది జరుగుతంది. అయితే ఈ స్కామ్ పేరు స్మిషింగ్ ఎటాక్ స్కామ్. మరి, ఈ స్కామ్ గురించి, దీని నుంచి జాగ్రత్తపడే వివరాలను ఇప్పుడు తెలసుకుందాం.

  • Published May 11, 2024 | 6:07 PMUpdated May 11, 2024 | 6:07 PM
మార్కెట్ లోకి కొత్త స్కామ్! మీ అకౌంట్ లోకి  డబ్బులు వేసి మరీ  ముంచేస్తారు!

ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు కొత్త రకం స్కామ్స్ కు పాల్పడుతున్నారు. ముఖ్యంగా బ్యాంక్ కస్టమర్లనే లక్ష్యంగా చేసుకొని కొత్తగా స్మిషింగ్ అటాక్ ను ప్రయోగిస్తున్నారు. అయితే ఇది కూడా ఒక రకమైన ఫిషింగ్ అటాక్. అనగా.. బ్యాంకు కస్టమర్లకు SMS రూపంలో పంపించిన అది పెద్ద స్కామ్ అని అర్ధం.ఇక బ్యాంకు అకైంట్ ఉన్న వారందరూ ఈ సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుపోయే ప్రమాదం ఉంటుంది. అసీ స్మిషింగ్ అటాక్ అంటే ఏంటి అనుకుంటున్నారా.. ఇది మీ బ్యాంకు ఖాతాలోని సొమ్మును కొల్ల గొట్టే ఒక పెద్ద ఎత్తుగడ. మరి, ఈ భారీ స్కామ్ లో కష్టమర్లను ఎలా మోసం చేస్తారు.వారి దగ్గరు నుంచి సొమ్మును ఎలా కాజేస్తారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

స్మిషింగ్ అనేది ఒక రకమైన సైబర్ అటాక్. ఇది SMS, ఫిషింగ్ రెండింటి రూపంలో కలగలిపి ఉంటుంది. అయితే దీని ద్వారా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ను షేర్ చేసి ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. ఇందులో మొదటగా ఒక మోసపూరితమైన సందేశాన్ని బ్యాంకు కస్టమర్ల నంబర్ కు టెక్ట్స్ రూపంలో పంపిస్తారు. ఆ తర్వాత కస్టమర్ల బ్యాంకు అకౌంట్ నుంచి భారీ మొత్తంలో నగదును కొల్లగొడతారని.. సైబర్ సెక్యూరిటీ కంపెనీ సాట్రిక్స్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సచ్చిన్ గజ్జెర్ చెప్పారు.

అయితే కొత్తగా వచ్చిన స్మిషింగ్ స్కామ్‌తో..  ముందుగా మీ బ్యాంకు అకౌంటర్లోకి కొంత మొత్తంలో డబ్బులు పడినట్లు ఒక మొబైల్ నంబర్ నుంచి SMS వస్తుంది. ఇక ఆ తర్వాత కాసేపటికే మీకు ఒక ఫోన్ వస్తుంది. కాగా, పొరపాటున మీ బ్యాంకు అకౌంట్లోకి పెద్ద మొత్తంలో డబ్బులు పంపించామని నమ్మించే ప్రయత్నం చేస్తారు. అందుకోసం ఒక యూపీఐ నంబర్ చెప్పి..దానికి తిరిగి ఆ నగదును చెల్లించాల్సిందిగా పేర్కొంటారు. ఇక ఆ సందేశం అనేది.. చాలా సందర్భల్లో బ్యాంకు కస్టమర్లకు డబ్బులు డెబిట్/క్రెడిట్ లావాదేవీలకు సంబంధించి పంపే SMS లను పోలి ఉంటాయి. కనుక మీరు మొదటిసారి ఈ సందేశాన్ని చూసినట్లయితే వెంటనే దీనిని నమ్ముస్తారు. ఎందుకంటే.. ఇది ఆ మెసేజ్ ఉదాహరణకు.. ‘Rs. 15000 Credited to a/c XXXXX9082 on 10-05-24 by a/c linked to VPA XXXX9082 (UPI Ref No 41356463189)’ ఇలా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కనుక మీకు ఆ సందేశం వచ్చినట్లయితే నిశితంగా దానిని పరిశీలించి.. ఎవరు  పంపారో చెక్ చేస్తే.. అక్కడ మీకు ఒక మొబైల్ నంబర్ కనిపిస్తుంది. ఇక్కడే మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే.. బ్యాంకులు మొబైల్ నంబర్ నుంచి సందేశాల్ని పంపించవు. అందుకే ఈ తరహా స్కామ్స్ కు మీకు ఎదురయ్యినప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక్కడ మీ అకౌంట్లలో మీకే డబ్బులు వేశాం అంటూ.. మీ అకౌంట్లలో డబ్బులను కొల్లగొడతారు. అయితే ఇలాంటి మోసాలు జరగకుండా ఉండేందుకు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే బ్యాంకులకు కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. కాగా, కస్టమర్లకు SMS లాంటివి పంపించేందుకు సంబంధిత బ్యాంకులు రిజిస్టర్డ్ సెండర్ ID కలిగి ఉండాలని ఆదేశించింది. మరి, ఈ కొత్త రకం స్మిషింగ్ స్కామ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి