iDreamPost
android-app
ios-app

UPI కొత్త మోసం.. అకౌంట్ కు డబ్బులు పంపించి.. ఖాతా లూటీ చేస్తూ..

  • Published Sep 13, 2024 | 2:48 PM Updated Updated Sep 13, 2024 | 2:48 PM

UPI New Cyber Crime: ప్రస్తుతం దేశంలో గూగుల్ పే, ఫోన్ పే వంటి డిజిటల్ అప్లికేషన్ల పేరిట కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ మోసాలకు సంబంధించి వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులు వివరించారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

UPI New Cyber Crime: ప్రస్తుతం దేశంలో గూగుల్ పే, ఫోన్ పే వంటి డిజిటల్ అప్లికేషన్ల పేరిట కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ మోసాలకు సంబంధించి వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులు వివరించారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Sep 13, 2024 | 2:48 PMUpdated Sep 13, 2024 | 2:48 PM
UPI కొత్త మోసం.. అకౌంట్ కు డబ్బులు పంపించి.. ఖాతా లూటీ చేస్తూ..

ప్రస్తుత కాలంలో గూగుల్ పే, ఫోన్ పే లు వాడని వారంటూ ఎవరు లేరు. ఎందుకంటే.. ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్ యుగం నడుస్తుంది. దీంతో చిన్న చిన్న షాపుల దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపిగ్ మాల్స్ వరకు అందరూ యూపీఐ పేమెంట్స్ నే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలో యూపీఐ చెల్లింపులు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నాయి. అలాగే అంతే వేగంగా ఈ డిజిటల్ పేమెంట్స్ పేరిట మోసాలు కూడా ఎక్కువైపోతున్నాయి. కాగా, ఇప్పటికే ఈ అప్లికేషన్ల పేరిట అనేక మోసాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ గూగుల్ పే, ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ పేరిట మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం దేశంలో గూగుల్ పే, ఫోన్ పే వంటి డిజిటల్ అప్లికేషన్ల పేరిట కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ మోసాలకు సంబంధించి వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులు వివరించారు. అదేమిటంటే.. ఇప్పటి వరకు మనకు తెలియకుండా ఎవరైనా గూగుల్ పే, ఫోన్ పే, యూపీఐ యాప్ ల ద్వారా డబ్బులను పంపిస్తే.. ఆ తర్వాత పొరపాటున డబ్బులను మీకు పంపిచమని, తిరిగి అదే నంబర్ కు నగదును పంపమని అడిగేవారు. దీంతో మనం కూడా సానుభూతి చూపి తిరిగి ఆ డబ్బును వారి ఖాతాకు పంపించేవాళ్లం. కానీ, ఈ మార్గాన్ని కూడా అవకాశంగా తీసుకొని క్యాష్ చేసుకోవాలనుకునే సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు.

అదేలా అనుకుంటున్నారా.. ఎప్పుడైతే ఇలా మన ఖాతాకు వచ్చిన డబ్బలను అవతల వ్యక్తి ఖాతాకు పంపిస్తామో.. ఈ ప్రకియలో కొత్తగా టెక్ట్స్ రూపంలో ఓ హ్యాకింగ్ లింక్ ను పెడుతున్నారు. దీనిని క్లిక్ చేయడం ద్వారా మన బ్యాంకు ఖాతా మొత్తం హ్యాక్ అవుతుంది. ఈ క్రమంలోనే.. మన అకౌంట్ లో ఉన్న మొత్తం డబ్బులను సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారు. ఈ విధంగా రాను రాను ఈ ట్రాన్సక్షన్స్ పేరిట మోసాలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు ఈ తరహా మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా.. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కకుండా సురక్షితంగా ఉండేందుకు చేయవలసిన జాగ్రత్తలను కూడా సూచించారు.

సైబర్ మోసం నుంచి సురక్షితంగా ఉండేందుకు జాగ్రత్తాలు:

  • ఎవరైనా తెలియని వ్యక్తి నుంచి Google Pay, Phonepe,  UPI యాప్‌లలో డబ్బులను పంపినప్పుడు, దాన్ని తిరిగి పంపమని అడిగితే వెంటనే డబ్బు పంపకండి.
  • ఇలా డబ్బు పంపిన వ్యక్తిని సంప్రదించి, వారి గుర్తింపు కార్డులతో సమీపంలో పోలీస్ స్టేషన్ కు వచ్చి నగదు తీసుకోమని చెప్పండి.
  • ముఖ్యంగా ఇలా డబ్బులు పంపినవారు మీకు టెక్ట్స్‌ సందేశంలో లింక్‌ను పంపితే, దానిపై క్లిక్ చేయవద్దు.
  • ఇది మీ బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేయడానికి లింక్ అయ్యే అవకాశం ఉండొచ్చు.
  • కనుక ఆ లింక్‌పై క్లిక్ చేస్తే మోసగాళ్లు మీ బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసే అవకాశాలు ఉంటుంది.
  • గుర్తించుకోండి SMS ద్వారా మీకు పంపబడిన లింక్‌లు పూర్తిగా నకిలీవి, చాలా ప్రమాదకరమైనవి.
  • ఒకవేళ వాటిని మీరు క్లిక్ చేస్తే సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే అవకాశం ఉంటుంది.
  • తద్వారా మీ ఖాతాలో డబ్బులను సైబర్ నేరగాళ్లు  లూటీ చేస్తారు