iDreamPost
android-app
ios-app

మాజీ ప్రేయసిపై రక్తచరిత్ర లెవల్లో రివేంజ్! ఇంటికి పార్శిల్ పంపిన ప్రియుడు!

ప్రేయసి కాదంటే తాగుడుకు బానిసైపోతుంటాడు ప్రియుడు. మరికొంత మంది మూవ్ ఆన్ అయిపోతారు. లేదంటే ఆమెపై వెంటనే కక్ష తీర్చుకుంటారు. కానీ ఈ లవర్ మాత్రం ఘోరం. తనను కాదని మరొకర్ని పెళ్లి చేసుకుందన్న ఉద్దేశంతో

ప్రేయసి కాదంటే తాగుడుకు బానిసైపోతుంటాడు ప్రియుడు. మరికొంత మంది మూవ్ ఆన్ అయిపోతారు. లేదంటే ఆమెపై వెంటనే కక్ష తీర్చుకుంటారు. కానీ ఈ లవర్ మాత్రం ఘోరం. తనను కాదని మరొకర్ని పెళ్లి చేసుకుందన్న ఉద్దేశంతో

మాజీ ప్రేయసిపై రక్తచరిత్ర లెవల్లో రివేంజ్! ఇంటికి పార్శిల్ పంపిన ప్రియుడు!

ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది కానీ.. ప్రాణాన్ని కాదు. తమ ప్రేమ పెళ్లి పీటలు ఎక్కదని తెలిసి చాలా మంది జంటలు..విడిపోయి తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని చేసుకుంటున్నారు. ప్రేమించిన ప్రేయసి ఎక్కడ ఉన్నా బాగుండాలని కోరుకుంటాడు ప్రియుడు. ఆమె జ్ఞాపకాల్లో బతుకుతుంటాడు. అలా కొంత కాలం అయ్యాక.. కాస్త కుదుట పడి, పేరెంట్స్ కోసం మరో మహిళ మెడలో మూడు ముళ్లు వేస్తాడు. ఆ తర్వాత తన సంసారం, తన పిల్లలు అంటూ మాజీ ప్రేయసిని మర్చిపోతాడు. దేశంలో 90 శాతం ప్రేమ కథల్లో ఇదే జరుగుతుంది. కానీ ఈ ప్రేమికుడు మాత్రం మాజీ ప్రేయసిపై కత్తిగట్టాడు. ప్రేయసికి పెళ్లైన కొన్నాళ్లకు గిఫ్ట్ పంపి..ఆమె శోకానికి కారణం అయ్యాడు.

ప్రేయసి తనను మోసం చేసి మరొకర్ని పెళ్లి చేసుకోవడం తట్టుకోలేక ఓ ప్రియుడు.. ఆమెను హత్య చేయాలనుకున్నాడు. ఇంటికి బాంబును పార్శిల్ పంపగా.. ఏముందని తీసినందుకు ఇద్దరు ప్రాణాలు పోయాయి. మరో ఇద్దరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషాద ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వడాలిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాళ్లోకి వెళితే.. జయంతిభాయ్ బాలు సింగ్ వంజారా అనే వ్యక్తి ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే ఆమె అతడ్ని తిరస్కరించి.. జీతూభాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు. అయితే తనను ప్రియురాలు కాదన్నందని అక్కసు పెంచుకున్న ప్రియుడు.. లవర్‌ను చంపేయాలని అనుకున్నాడు. ఓ టేప్ బాంబ్ పార్శిల్ చేసి ఆటో రిక్షాలో ఆమె ఇంటికి పంపాడు.

ఆ సమయంలో జీతూభాయ్ భార్య ఇంట్లో లేకపోవడంతో.. అతడు ఈ పార్శిల్లో ఏముందని తీసి చూశాడు. టేప్ రికార్డర్‌లా ఉందని ప్లగ్ పై నొక్కగా అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో జీతూభాయ్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతడి పెద్ద కుమార్తె భూమిక ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించింది. ఇద్దరు కుమార్తెలు కళ్లు, ఛాతీపై తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, పోలీసులకు సమాచారం అందింది. ఈ పార్శిల్ ఎక్కడ నుండి వచ్చిందన్న ఎంక్వైరీ చేయగా.. ఆటో రిక్షా వ్యక్తిని పట్టుకుని నిలదీయగా.. జయంతి భాయ్ గురించి సమాచారం అందించాడు. పోలీసులు బృందాలుగా ఏర్పడి.. నిందితుడ్ని అరెస్టు చేశారు. అప్పుడు తెలిసింది..మాజీ ప్రేయసి, ఆమె కుటుంబాన్ని చంపేసేందుకు ప్రియుడు ఇంత దుర్మార్గానికి దిగాడని. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాజీ ప్రియుడి చేసిన పనికి ఆమె భర్తను, పాపను పొగొట్టుకుని కన్నీటి పర్యంతం అవుతుంది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetpark girişrobinbetjojobet girişslot siteleriMadridbetMadridbetmadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş