iDreamPost
android-app
ios-app

భర్తతో కటీఫ్.. ప్రియుడితో కాపురం.. కట్ చేస్తే..

  • Published Oct 11, 2024 | 12:00 PM Updated Updated Oct 11, 2024 | 12:00 PM

అక్రమ సంబంధాలు సామాజిక విలువలను దెబ్బతీస్తున్నాయి. ఆనందంగా ఉండాల్సిన సంసార జీవితంలో విష గుళికల్లా మారాయి. చివరకు ప్రాణాలు తీసుకునేంత వరకు వెళుతున్నాయి. మానసిక ప్రశాంతతతో పాటు కుటుంబాన్ని దూరం చేస్తున్నాయి. తాజాగా

అక్రమ సంబంధాలు సామాజిక విలువలను దెబ్బతీస్తున్నాయి. ఆనందంగా ఉండాల్సిన సంసార జీవితంలో విష గుళికల్లా మారాయి. చివరకు ప్రాణాలు తీసుకునేంత వరకు వెళుతున్నాయి. మానసిక ప్రశాంతతతో పాటు కుటుంబాన్ని దూరం చేస్తున్నాయి. తాజాగా

  • Published Oct 11, 2024 | 12:00 PMUpdated Oct 11, 2024 | 12:00 PM
భర్తతో కటీఫ్.. ప్రియుడితో కాపురం.. కట్ చేస్తే..

మూడు ముళ్ల బంధాన్ని ఎగతాళి చేస్తున్నారు కొంత మంది అతివలు. పక్కదారి పడుతూ వివాహ బంధం యొక్క గౌరవాన్ని కాలరాస్తున్నారు. భర్తకు పంచాల్సిన పడక సుఖాన్ని.. మరొకరితో పంచుకుంటున్నారు. పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. ఈ వివాహేతర సంబంధాల వల్ల కుటుంబ కలహాలు, కాపురాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఈ అక్రమ సంబంధాలు.. ఆనందంగా ఉండాల్సిన సంసార జీవితంలో విష గుళికల్లా మారాయి. చివరకు ప్రాణాలు తీసుకునేంత వరకు వెళుతున్నాయి. అందుకు ఉదాహరణే ఈ ఘటన. అటు భర్త, ఇటు ప్రియుడితో కాపురం చేస్తోంది వివాహిత. కొన్ని రోజులు భర్త దగ్గర, మరికొన్ని రోజులు ప్రియుడితో కలిసి ఉంటుంది. అయితే ఆమె చేస్తున్న చేష్టలకు చిరాకు తెచ్చుకున్న భర్త, ఆమె తమ్ముడు ప్రియుడ్ని హత్య చేశారు. ఈ ఘటన తెలంగాణలోని పెద్ద పల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

రామగుండం ఏరియాలోని 8 ఇంక్లైన్ కాలనీలో నివసిస్తోంది అంజలి కుటుంబం. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హాయిగా సాగిపోతున్న వీరి సంసారంలోకి హనుమాన్ నగర్‌కు చెందిన వడ్డాది వినయ్ కుమార్‌ ఎంట్రీ ఇచ్చాడు. సింగరేణి ఆసుపత్రిలో స్కావేంజర్‌గా పనిచేస్తున్న అతడు.. అంజలి గుండెల్లో అలజడి సృష్టించాడు. అతడితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయింది.  వినయ్ మాయ మాటలకు పడిపోయి సర్వస్వం అప్పగించింది. భర్తకు తెలియకుండా అతడితో వ్యవహారం నడిపింది. భర్తకేమో అంజలి అంటే ప్రాణం.. అంజలికి వినయ్ అంటే ఇష్టం. చివరకు వినయ్ వైపే ఆమె మనస్సు లాగేసింది. బిడ్డను వదిలేసి వినయ్ దగ్గరకు వచ్చేసింది. విడాకులు తీసుకోకుండా ప్రియుడ్ని రెండో వివాహం చేసుకుంది. వీరి పెళ్లిని ఎవరూ అంగీకరించకపోవడంతో రెండో భర్త వినయ్‌తో కలిసి అతడి ఇంట్లో కాపురం పెట్టింది. ఆమెకు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వగా.. మొదటి భర్త వద్దకు వచ్చేసింది. తన భార్య తన దగ్గరకు వచ్చేసిందని సంబరపడిపోయాడు అంజలి భర్త.

ఆ ఆనందాన్ని అతడికి ఎంత సేపు మిగుల్చలేదు భార్య. మళ్లీ ప్రియుడు, రెండో భర్త అయిన వినయ్ దగ్గరకు వెళ్లిపోయింది. దీంతో అంజలిపై కోపంతో రగలిపోయాడు కట్టుకున్నోడు. వినయ్ దగ్గరకు వెళ్లిపోవడంతో అతడ్ని అంతం చేయాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని అంజలి సోదరుడికి చెప్పాడు. ఇద్దరు కలిసి.. వినయ్‌ను చంపేందుకు ప్లాన్ సిద్దం చేసుకున్నారు. వినయ్ ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడి కత్తులతో నరికి చంపారు. ఈ ఘటనలో  వినయ్ మరణించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. అంజలి భర్త, తమ్ముడ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. కాపురంలో కుంపట్లు పెడుతున్న ఈ వివాహేతర సంబంధాలను ముగింపు పలికాలంటే ఏం చేస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabetgrandpashabetganobet