iDreamPost

చదువుకున్న మూర్ఖుడు… భార్యకు మూడోసారి కూడా ఆడపిల్ల అని తెలిసి

Suryapet Crime News.. చదువు జ్ఞానాన్ని కలిగించాలని కానీ ఇతడ్ని అజ్ఞానంలోకి నెట్టింది. పేరు డాక్టరేట్ పొందాడు ఎందుకు.. ఆ చదువును కుప్పతొట్టిలో పోశాడు. ఇద్దరు ప్రాణాలను బలితీసుకున్నాడు ఈ చదువుకున్న మూర్ఖుడు.

Suryapet Crime News.. చదువు జ్ఞానాన్ని కలిగించాలని కానీ ఇతడ్ని అజ్ఞానంలోకి నెట్టింది. పేరు డాక్టరేట్ పొందాడు ఎందుకు.. ఆ చదువును కుప్పతొట్టిలో పోశాడు. ఇద్దరు ప్రాణాలను బలితీసుకున్నాడు ఈ చదువుకున్న మూర్ఖుడు.

చదువుకున్న మూర్ఖుడు… భార్యకు మూడోసారి కూడా ఆడపిల్ల అని తెలిసి

ఆడ, మగ సమానం అనుకుంటున్న ఈ రోజుల్లో కొంత మంది చదువుకున్న మూర్ఖుల కారణంగా కళ్లు తెరవకుండానే కన్నుమూస్తున్నారు ఆడ శిశువులు. వంశాకురం, వంశోద్దారకుడు అంటూ మగపిల్లల కోసం పరితపిస్తూ..చట్ట విరుద్దం అని తెలిసినా కూడా లింగ నిర్దారణకు పాల్పడుతున్నారు. అక్కడితో ఆగకుండా కడుపులో ఉన్నది అమ్మాయి అని తెలియగానే.. బలవంతపు గర్భవిచిత్తికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బిడ్డతో పాటు తల్లి కూడా మరణించిన దాఖలాలు ఉన్నాయి. తాజాగా సూర్యా పేటలో ఈ తరహా ఘటన వెలుగు చూసింది. చదువుకున్న ఓ మూర్ఖుడు.. తనకు పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి కడుపులో బిడ్డను చిదిమేశాడు. చివరకు తట్టుకోలేక భార్య కూడా చనిపోయింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.

పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..సూర్యాపేట జిల్లా చివ్వెల మండలం ఎంజీనగర్‌ తండా చెందిన రత్నావత్‌ హరిసింగ్‌కు మహబూబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం రాముతండాకు చెందిన బట్టు కృష్ణ, క్రాంతి దంపతుల కుమార్తె సుహాసినికి 2019లో వివాహం అయ్యింది. వీరికి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. హరిసింగ్ ఇటీవల ఉస్మానియా మెడికల్ కాలేజీ నుండి పీహెచ్డీ పట్టా కూడా పొందాడు. కాగా, అతడికి వారసుడు కావాలన్న కోరిక ఉండేది. మగపిల్లాడు లేకపోతే మరో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో భార్య ఆపరేషన్ చేయించుకోలేదు. ఈ క్రమంలో సుహాసిని మూడవ సారి గర్భవతి కాగా, రహస్యంగా కోదాడలోని విజయ హాస్పిటల్ డాక్టర్ గురవయ్య తన వద్దకు తీసుకెళ్లి స్కానింగ్ చేయగా..కడుపులో ఆడపిల్ల అని తేలింది. దీంతో ఆమెకు అబార్షన్ చేయించాలని అనుకున్నాడు. అప్పటికే ఏడు నెలల గర్భవతి అయిన సుహాసిని ఇందుకు నిరాకరించింది. అయితే అబార్షన్ చేయించుకోకపోతే వదిలేస్తాను అంటూ భయపెట్టాడు.

దీంతో ఏం చేసేది లేక ఒప్పుకుంది. తొలుత ఓ ఆర్ఎంపీ డాక్టర్ తో అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించాడు. కానీ కాలేదు. వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రి నర్సుతో టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇప్పించాడు. విపరీతంగా బ్లీడింగ్ అయ్యింది. వెంటనే ఆమెను కోదాడలో స్కానింగ్ చేసిన ఆసుపత్రికి తరలించారు. జూన్‌ 26న ఉదయం డాక్టర్‌ గురవయ్య సీరియస్‌గా ఉందని చెప్పడంతో.. అక్కడి నుండి ఖమ్మంలోని ప్రశాంతి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వైద్యులు తమ వల్ల కాదని చెప్పడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా.. సూర్యాపేట సమీపంలోకి రాగానే సుహాసిని పరిస్థితి మరింత విషమించింది. సూర్యాపేటలోని రాంమూర్తి ఆస్పత్రికి తీసుకురాగా పరీక్షించిన డాక్టర్‌ ఆమె అప్పటికే మృతి చెందినట్లు చెప్పాడు. వెంటనే సుహాసిని మృతదేహాన్ని ఎంజీనగర్‌ తండాకు తీసుకొని వెళ్లారు. తండ్రికి అసలు విషయం తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతురాలి భర్త హరిసింగ్‌తో పాటు పలువుర్ని అరెస్టు చేశారు. పదహారు మందిపై కేసు నమోదు చేశారు.  దర్యాప్తు కొనసాగుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి