iDreamPost
android-app
ios-app

తండ్రిని కష్టాల నుండి గట్టెక్కిద్దామనుకుంది కానీ..

ఆమెకు చదువంటే ప్రాణం. ఉన్నత చదువులు చదివి.. కుటుంబానికి అండగా నిలవాలనుకుంది. కానీ ఆమె ఆశలపై నీళ్లు జల్లాయి..

ఆమెకు చదువంటే ప్రాణం. ఉన్నత చదువులు చదివి.. కుటుంబానికి అండగా నిలవాలనుకుంది. కానీ ఆమె ఆశలపై నీళ్లు జల్లాయి..

తండ్రిని కష్టాల నుండి గట్టెక్కిద్దామనుకుంది కానీ..

ఆమె చదువుల తల్లి సరస్వతి. చదువంటే విపరీతమైన ఇష్టం. పుస్తకాలు పురుగు అన్నా,  ఎక్కువ చదివితే మతి పోతుంది అంటూ ఆట పట్టించినా.. చదువే లోకంగా బతికింది. అన్నింటా మంచి మార్కులు సాధించింది.  తండ్రి తనపై నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్ట పడి చదివింది. ఉన్నత విద్యను అసభ్యసించి.. కుటుంబానికి అండగా నిలవాలనుకుంది. తాను ఉద్యోగం చేసి.. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని ఈడుస్తున్న తండ్రికి రెస్ట్ ఇవ్వాలనుకుంటుంది. మంచి ఇల్లు, తాను ఆశించిన జీవితం పొందాలనుకుంది. కానీ ఆమె ఆశలపై నీళ్లు కుమ్మరించాయి ఆర్థిక కష్టాలు. చదువే ప్రాణంగా భావించిన ఓ అమ్మాయి.. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్ ప్రగతి నగర్‌కు చెందిన ఆషాడపు కొమురయ్యకు కుమార్తె రమ్య, కుమారుడు ఉన్నారు. కొమురయ్య కూలీ నాలీ చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు రమ్య  కుటుంబానివి.తన కాయాకష్టంతో వచ్చిన డబ్బులతోనే పిల్లల్ని చదివించాడు తండ్రి.  అంతంత మాత్రమే ఆదాయం అయినప్పటికీ కూతుర్ని పీజీ వరకు చదివించాడు. ఇంకా చదువుల కోసం పెట్టుబడి పెట్టలేని పరిస్థితులు అతడివి. ఆమెకు మరింత ఉన్నత చదువులు చదివి.. గొప్ప స్థాయికి చేరుకోవాలని కోరిక. నాన్నా.. పై చదువులు చదువుతాను అని చెబితే.. పైసా ఖర్చ పెట్టలేని స్థోమత తండ్రిది.

తాను ఇంకా చదువుతాను నాన్నా అంటే.. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో తండ్రి మిన్నకుండిపోయాడు.  దీంతో ఉన్నత చదువులు చదవలేకపోతునాన్నని మనస్థాపం చెందిన యువతి.. ఇంట్లో బలవన్మరణానికి పాల్పడింది. దీంతో మనస్థాపానికి గురైన కూతురు.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరేసుకుని చనిపోయింది. చావే తన సమస్యకు పరిష్కారమని అనాలోచిత నిర్ణయాన్ని తీసుకుని.. బలవంతంగా ప్రాణాలు తీసుకుంది.  కూతురు మరణవార్తతో కొమురయ్య.. ఒక్క సారిగా కుప్పకూలిపోయాడు. అప్పో, సప్పో చేసి చదివించుకొందునే అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. బాగా చదివే అమ్మాయి, నలుగురిలో కలివిడిగా తిరిగే యువతి ఇలా బలవన్మరణానికి పాల్పడిందన్న విషయం తెలిసి స్థానికులు సైతం కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమ ప్రాణ స్నేహితురాలు మరణించిందన్న వార్త తెలిసి ఫ్రెండ్స్ కూడా కంటతడి పెట్టుకున్నారు. తండ్రి కొమురయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.