లవ్ మ్యారేజ్.. కానీ మోజు తీరిపోయాక..

అనూష, సైదులిది ప్రేమ వివాహం. వీరి ప్రేమకు ప్రతిరూపంగా ఇద్దరు పిల్లలు పుట్టారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ అంతలోనే భార్యపై అనుమానం. మోజు తీరిపోవడంతో మరో పెళ్లికి సిద్ధమయ్యాడు.

అనూష, సైదులిది ప్రేమ వివాహం. వీరి ప్రేమకు ప్రతిరూపంగా ఇద్దరు పిల్లలు పుట్టారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ అంతలోనే భార్యపై అనుమానం. మోజు తీరిపోవడంతో మరో పెళ్లికి సిద్ధమయ్యాడు.

పదిహేనేళ్ల క్రితం పెద్దలను ఎదిరించి.. కులాంతర వివాహం చేసుకున్నారు సైదులు, అనూష. వీరి ప్రేమకు ప్రతిరూపంగా ఇద్దరు పిల్లలు జన్మించారు. భార్యాభర్తలిద్దరు ఉద్యోగం చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. హాయిగా సాగిపోతున్న వీరి కాపురంలోకి అనుమానం చొరబడింది. అది పెను భూతంగా మారి భర్తకు నిద్ర లేకుండా చేసింది. ఆమె అడ్డుతొలగించుకుని, మరో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే తన మీదకు హత్యానేరం పడకూడదని అనుకున్నాడు. మాస్టర్ ప్లాన్ వేసి.. భార్యను హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. కానీ అత్తగారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో పడి గల్లంతైన అంగన్ వాడీ టీచర్ అనూష మృతి కేసు వీడింది. భర్తే హంతకుడని తేలింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లాలోని వేముల పల్లి మండలం ఆమనగల్లు గ్రామానికి చెందిన పేరబోయిన సైదులు.. మిర్యాలగూడకు చెందిన అనూష 15 ఏళ్ల క్రితం ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం కొడుకు, కూతురు ఉన్నారు. అనూష వేముల పల్లి మండలంలోని రావుగారి గూడెంలో అంగన్ వాడీ టీచర్‌గా పని చేస్తోంది. ఇటీవల ఆమెకు కామేపల్లి గ్రామంలో ఇన్ చార్జి అంగన్ వాడీ టీచర్‌గా బాధ్యతలు అప్పగించారు. అక్కడ కూడా విధులు నిర్వర్తిస్తోంది. సైదులు కామన్ సర్వీస్ సెంటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త. దీనిపై నిత్యం గొడవలు జరుగుతుండటంతో పెద్దల దగ్గరకు వెళ్లింది వీరి పంచాయతీ. ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా అతడిలో మార్పు రాలేదు. వ్యవహారం పెద్దల వరకు రావడంతో అనూషపై మరింత కోపం పెంచుకున్నాడు సైదులు. ఆమె అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు. కానీ మరక తనపై పడకూడదనుకున్నాడు. దీని కోసం బుర్రలో ప్లాన్ గీసుకున్నాడు. దాన్ని అప్లై చేసేందుకు టైం కోసం వెయిట్ చేశాడు. ఆ రోజు రానే వచ్చింది.

ఈ నెల 5న కామేపల్లిలో విధులు ముగించుకున్న అనూష భర్తకు ఫోన్ చేసి.. ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. కాస్త లేట్ అవుతుంది వెయిట్ చెయ్ అంటూ చీకటి పడ్డాక ఆమె దగ్గరకు వెళ్లాడు. ఆమెను బైక్ పై ఎక్కించుకుని రావుల పెంట గ్రామ శివారులో నాగార్జున సాగర్ ఎడమ కాల్వ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లాడు. బైక్ ఆపి భార్యతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం ఆమెపై చేయి చేసుకుని.. కాల్వలోకి తోసేశాడు. ప్రమాదవశాత్తూ పడినట్లు చిత్రీకరించేందుకు బైక్ కాల్వలోకి పడేసి.. అతడు దూకేసి ఈదుకుంటూ బయటకు వచ్చేశాడు. తర్వాత భార్య కాల్వలో పడి కొట్టుకుపోయిందంటూ స్థానికులను, బంధువులను నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే అనూష తల్లికి అల్లుడు సైదులు చెబుతున్న సమాధానాలు పొంతన లేకుండా అనిపించాయి. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతలో ఆమెను మరో మార్గంలో తీసుకెళ్లడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సైదులును అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే కాల్వలోకి తోసేసినట్లు అంగీకరించాడు. భార్యపై అనుమానంతోనే హత్య చేశానని, మరో పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు నేరం ఒప్పుకున్నాడు.

Show comments