iDreamPost
android-app
ios-app

ప్రియుడి కోసం ఇలా చేయాలా? తల్లితండ్రి గుర్తు రాలేదా నీకు?

  • Published Apr 12, 2024 | 6:20 PM Updated Updated Apr 12, 2024 | 6:31 PM

ఈ రోజుల్లో యువత మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నారు. అయిన దానికి, కానీ దానికి వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆ ఆవేశంలో వారు ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియడం లేదు. చివరకు

ఈ రోజుల్లో యువత మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నారు. అయిన దానికి, కానీ దానికి వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆ ఆవేశంలో వారు ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియడం లేదు. చివరకు

  • Published Apr 12, 2024 | 6:20 PMUpdated Apr 12, 2024 | 6:31 PM
ప్రియుడి కోసం ఇలా చేయాలా? తల్లితండ్రి గుర్తు రాలేదా నీకు?

ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయానికి మనస్థాపానికి గురౌతున్నారు అమ్మాయిలు, అబ్బాయిలు. చీమ చిటుక్కుమనేలోపే బలవంతంగా ప్రాణాలు తీసేసుకుంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు.. చదువుకునే వయస్సులో చదువుల ఒత్తిడి, ప్రేమ వ్యవహారం విషయాల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలా సులువుగా బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఒక్క నిమిషం తల్లిదండ్రులు, భవిష్యత్తుపై ఆలోచన చేసినా ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు.  కన్నవారికి పుత్ర, పుత్రికా శోకాన్ని మిగల్చరు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఓ విద్యార్థిని దారుణానికి ఒడిగట్టింది. 16వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం అయ్యింది.

ఇండోర్‌లోని లసుడియా పోలీస్ స్టేషన్ పరిధిలోని పినాకిల్ డ్రీమ్స్ టౌన్‌షిప్‌లో ఓ భనవంలోని 16వ అంతస్తు నుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రాథమిక విచారణలో తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. జుల్వానియా సమీపంలోని కోఠి గ్రామ నివాసి అని, ఆమె పేరు ముస్కాన్ అగర్వాల్ అని తేలింది. ఆమె ఇండోర్‌లోని ప్రెస్టీజ్ కాలేజీలో బీబీఏ మూడో సంవత్సరం చదువుతుంది. స్కీమ్ 54లోని హాస్టల్లో నివసిస్తుంది.

అయితే ఓ వ్యక్తిని కలిసేందుకు పినాకిల్ డ్రీమ్స్ టౌన్ షిప్‌కు వచ్చింది. అంతలో ఏమైందో తెలియదు. తీవ్రమైన కోపంతో నేరుగా నిర్మాణంలో ఉన్న పినాకిల్ డ్రీమ్ 16వ అంతస్థుకు వెళ్లింది. ఆమెను గార్డు అడ్డుకోగా.. చిర్రుబుర్రులాడుకుంటూ వేగంగా వెళ్లి అక్కడి నుండి దూకేసింది. అయితే ఆత్మహత్యకు ముందు ఆమెను యువకుడు ఇక్కడ వదిలేసి వెళ్లాడని, అతడు కోపంగా ఉన్నాడని, ఆ తర్వాతే ముస్కాన్ ఏడుస్తూ, ఏదో మాట్లాడుతూ.. కోపంతో భవనంపైకి వెళ్లి ఇలా చేసిందని చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రేమ వ్యవహారం ఏమన్నా ఉందా అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. విద్యార్థిని మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. మరింత విచారణ చేపడుతున్నారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş