iDreamPost
android-app
ios-app

వీళ్ల స్టోరీ వింటే కన్నీళ్లు ఆగవు.. ఇక్కడి నుంచి నాగ్ పూర్ వెళ్లి..

ప్రాణాంతకమైన వ్యాధి హింసిస్తున్న.. బతకాలన్న ఆశ వారిది. జీవితంపై ఆశతో ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వెళ్లారు. కానీ చివరకు అక్కడకు వెళ్లాక..

ప్రాణాంతకమైన వ్యాధి హింసిస్తున్న.. బతకాలన్న ఆశ వారిది. జీవితంపై ఆశతో ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వెళ్లారు. కానీ చివరకు అక్కడకు వెళ్లాక..

వీళ్ల స్టోరీ వింటే కన్నీళ్లు ఆగవు.. ఇక్కడి నుంచి నాగ్ పూర్ వెళ్లి..

భార్య అంటే విపరీతమైన ఇష్టం భర్తకు. కానీ ఆమెకు మాయదారి రోగం వచ్చింది. దీంతో మానసికంగా కుంగిపోయింది ఆ కుటుంబం. అయితే తమకు తాము ధైర్యం చెప్పుకున్నారు. చికిత్స కోసం ఓ రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వచ్చారు. బతుకుదామని వచ్చి.. చివరకు దారుణ నిర్ణయం తీసుకున్నారు. తాము లేకుంటే తమ కూతురు అనాథ అయిపోతుందని అనుకున్నారేమో ఏమో.. బిడ్డను కూడా చంపేందుకు ప్రయత్నించారు. కానీ పాప ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. భార్యా భర్తలు ఇద్దరు మరణించారు. ఈ ఘటన చూస్తుంటే.. చావడం కూడా ఇంత దూరం వచ్చారా అనిపించకమానదు. వీళ్ల స్టోరీ వింటే కన్నీళ్లు ఆగవు. కేరళకు చెందిన దంపతులు.. మహారాష్ట్రలో మరణించిన విషాద ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళకు చెందిన రిజు నాయర్, ప్రియా రిజు నాయర్ భార్యా భర్తలు. వీరికి ఓ పాప ఉంది. అన్యోన్యంగా సాగిపోతున్న సంసారంలోకి క్యాన్సర్ మహమ్మారి దాపురించింది. ప్రియా క్యాన్సర్ బారిన పడింది. అయితే కేరళలోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నా ఫలితం లేకపోవడంతో మహారాష్ట్రలోని నాగ్ పూర్ ప్రాంతానికి చికిత్స నిమిత్తం వచ్చింది ఈ కుటుంబం. భార్యను బతికించుకోవాలని ప్రయత్నించాడు. దాచుకున్న డబ్బులతో పాటు కొంత మంది దగ్గర అప్పు చేశాడు రిజు. వీరి బంధువులు, గ్రామస్థులు సైతం సాయం చేశారు. దీంతో ఆ సొమ్ముతో నాగ్ పూర్ వచ్చి.. రెండు నెలలుగా ఆమెకు చికిత్స అందిస్తున్నాడు. అయితే వైద్యానికి చేయించేందుకు డబ్బులు అయిపోయాయి.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు రిజు, ప్రియా. మందులకు, ఇతర అవసరాలకు డబ్బులు లేకపోడంతో ఇద్దరూ తమ జీవితాలను ముగించుకోవాలని నిర్ణయించుకున్నారు. రిజు నాయర్ తన భార్య ప్రియ, కుమార్తెకు శీతల పానీయంలో విషమిచ్చి, తానూ విషం కలిపిన కూల్ డ్రింక్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, భార్యాభర్తలిద్దరూ చనిపోయారు. అయితే అతని 12 ఏళ్ల కూతురు మాత్రం ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇందిరా గాంధీ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.