iDreamPost
android-app
ios-app

భార్యని వివాహేతర సంబంధం పెట్టుకోమని భర్త టార్చర్! వీడేం మొగుడు?

  • Published Sep 16, 2024 | 5:59 PM Updated Updated Sep 16, 2024 | 5:59 PM

ఏడాది క్రితమే భీమన్న, శరణకు వివాహం అయ్యింది. మూడు నాలుగు నెలల పాటు కాపురం హాయిగా సాగిపోయింది. ఆ తర్వాత భర్త అసల స్వరూపం బయటకు రావడం స్టార్ట్ అయ్యాయి. మరొకరితో పడకసుఖం పంచుకోవాలంటూ..

ఏడాది క్రితమే భీమన్న, శరణకు వివాహం అయ్యింది. మూడు నాలుగు నెలల పాటు కాపురం హాయిగా సాగిపోయింది. ఆ తర్వాత భర్త అసల స్వరూపం బయటకు రావడం స్టార్ట్ అయ్యాయి. మరొకరితో పడకసుఖం పంచుకోవాలంటూ..

  • Published Sep 16, 2024 | 5:59 PMUpdated Sep 16, 2024 | 5:59 PM
భార్యని వివాహేతర సంబంధం పెట్టుకోమని భర్త టార్చర్!  వీడేం మొగుడు?

ఈ మధ్య కాలంలో వివాహ బంధం బీటలు వారడానికి కారణమైన ప్రధాన అంశం వివాహేతర సంబంధం. మరో మహిళతో ఎఫైర్ నడుపుతున్నాడని భార్యకు చిన్న అనుమానం కలిగితే చాలు.. ఆ సంసారం ఛిన్నాభిన్నం కావడానికి. ఆ ఇంట్లో నిత్యం రణరంగమే. అలాగే భార్య పరాయి పురుషుడితో మాట్లాడితే సహించలేడు భర్త. కానీ ఈ స్టోరీలో సీన్ రివర్స్. కట్టుకున్న భార్యనే కోరరాని కోరిక కోరాడు భర్త. పరాయి వ్యక్తులతో పడక సుఖం పంచుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. ఆడది అత్యంత పవిత్రంగా భావించే శీలాన్ని మరొకరికి తాకట్టు పెట్టమన్నాడు కసాయి మొగుడు. ఈ చేష్టలతో షాక్ తింది భార్య. అంతేకాదు ప్రతిఘటించింది. దీంతో ఆమె అంతు చూశాడు. ఈ ఘటన కర్ణాటకలోని యాదగిరి జిల్లా షహాపూర్ తాలూకాలో చోటుచేసుకుంది.

భార్యను చంపి.. గుండెపోటుతో చనిపోయిందంటూ నాటకం ఆడగా.. పోస్టుమార్టం నివేదికలో అసలు విషయాలు వెలుగు చూశాయి. తమదైన స్టైల్లో పోలీసులు విచారించగా.. నిజం అంగీకరించాడు నిందితుడు. హున్సగి పట్టణానికి చెందిన భీమన్నకు గంగనాలకు చెందిన శరణ బసమ్మతో గత ఏడాది వివాహం జరిగింది. పెళ్లయిన మూడు నాలుగు నెలల పాటు వీరి సంసారం హాయిగా సాగిపోయింది. ఆ తర్వాత అతడిలో మార్పులు రావడం మొదలు పెట్టాయి. ఈ క్రమంలో భీమన్న పలువురి దగ్గర అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చకపోవడంతో భార్య శరీరాన్ని పెట్టుబడిగా పెట్టాలని భావించాడు. ఇదే విషయంపై భార్యతో డిస్కస్ చేశాడు. తాను అప్పు తీసుకున్న వ్యక్తులతో పడక సుఖం పంచుకోవాలని కోరడంతో షాక్ తింది భార్య. పలుమార్లు ఆమెపై ఒత్తిడి తెచ్చాడు.

చివరకు మాట వినడం లేదని, తాను కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు. తాను నపుంసకుడనని, పరాయి పురుషుడితో బిడ్డను కంటే.. పెంచుకుందామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. అయినా సరే శరణ బసమ్మ ససేమీరా చెప్పింది. తన పన్నాగం పారకపోవడంతో పాటు అప్పు ఇచ్చిన వ్యక్తుల నుండి ఒత్తిడి పెరగడంతో దారుణ నిర్ణయం తీసుకున్నాడు. జులై 25న తన పుట్టింటికి వెళ్లింది శరణ బసమ్మ.. రాత్రి భోజంన చేశాక ఇద్దరు పైకి వెళ్లి ఇదే విషయంపై మరోసారి చర్చించారు. దీనిపై పదే పదే ప్రస్తావన తీసుకు వస్తే.. తల్తిదండ్రులకు చెబుతాను అని హెచ్చరించింది. దీంతో భార్య గొంతు నులిమగా.. అపస్మారక స్థితిలోకి జారింది.

వెంటనే అత్తామామలకు మీ కూతురికి గుండెపోటు వచ్చిందని చెప్పాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు మరణించింది భార్య. అంతా సవ్యంగా జరిగిపోతున్న సమయంలో మృతురాలి సోదరుడికి అనుమానం వచ్చింది. ఆమె మొబైల్ చెక్ చేయగా.. పరాయి పురుషులతో భార్యను ఎఫైర్స్ పెట్టుకో అంటూ భర్త మాటలు రికార్డు అవ్వగా.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా.. అది హార్ట్ ఎటాక్ కాదు.. హత్య అని నిర్థారణైంది.. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.  భార్యను పరాయి పురుషుడితో గడపాలన్న భర్తను ఎలాంటి శిక్ష పడాలని అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet