iDreamPost
android-app
ios-app

కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన అల్లుడు.. కొడుకును పొగొట్టుకుని.. కూతురు..!

  • Published Jul 04, 2024 | 6:06 PM Updated Updated Jul 04, 2024 | 6:06 PM

ఇండియాలో ఆడపిల్లకు చదువుకు అయ్యే ఖర్చు కన్నా.. పెళ్లికి అయ్యే ఖర్చే ఎక్కువ. పెట్టిపోతలు పెట్టి.. భారీ కట్నకానుకలు ఇచ్చి అత్తారింటికి సాగనంపుతుంటారు పెరేంట్స్. ఇవన్నీ పంపిస్తే అత్తారింట కూతురు సుఖపడుతుందన్న యోచన. కానీ అక్కడకు వెళ్లాక.. పరిస్థితులు తారుమారు..

ఇండియాలో ఆడపిల్లకు చదువుకు అయ్యే ఖర్చు కన్నా.. పెళ్లికి అయ్యే ఖర్చే ఎక్కువ. పెట్టిపోతలు పెట్టి.. భారీ కట్నకానుకలు ఇచ్చి అత్తారింటికి సాగనంపుతుంటారు పెరేంట్స్. ఇవన్నీ పంపిస్తే అత్తారింట కూతురు సుఖపడుతుందన్న యోచన. కానీ అక్కడకు వెళ్లాక.. పరిస్థితులు తారుమారు..

  • Published Jul 04, 2024 | 6:06 PMUpdated Jul 04, 2024 | 6:06 PM
కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన అల్లుడు.. కొడుకును పొగొట్టుకుని.. కూతురు..!

కూతురికి కట్నకానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపుతారు తల్లిదండ్రులు. తమ కూతుర్ని మీకూతుర్నిలా చూసుకోవాలని అత్తామామలకు చెబుతుంటారు. భార్యను స్నేహితురాలిగా చూడాలని అల్లుడికి చెబుతారు. కానీ అక్కడకు వెళ్లాక పరిస్థితులు తారుమారు అవుతుంటాయి. కొంత మంది డబ్బు పిచ్చితో మరింత కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధిస్తుంటారు. ఏదో ఒక విషయంపై నిత్యం ఆమెతో గొడవపడుతూ మానసిక క్షోభకు గురి చేస్తుంటారు. తల్లిదండ్రులకు చెబితే.. ఎక్కడ బాధపడతారోనన్న ఆవేదనతో తోడబుట్టిన వాళ్లను తన గోడు వెళ్లిబుచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇదే జరిగింది ఈ అమ్మాయి విషయంలో. తనను వేధిస్తున్నాడని సోదరుడికి చెప్పుకోవడమే శాపమైంది.

భర్త ధన దాహానికి సోదరుడ్ని, తల్లిని పొగొట్టుకుంది ఇల్లాలు. కొన్ని రోజుల్లోనే ఇద్దర్ని కోల్పోయింది ఆ కుటుంబం. ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని మైసూర్‌లో చోటుచేసుకుంది. రామకృష్ణ నగర్‌లో నివాసం ఉంటే రవిచంద్రన్‌కు కోర్గళ్లి వాసి భాగ్యమ్మ కూతురితో వివాహం అయ్యింది. అయితే పెళ్లైన తర్వాత నుండి భార్యను హింసించేవాడు భర్త రవిచంద్రన్. అదనపు కట్నం తీసుకురావాలంటూ ఆమెను వేధించేవాడు. తానని చెప్పడంతో ఆమెను పలుమార్లు కొట్టాడు. అయితే ఈ విషయం ఓ రోజు ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో చెల్లి కాపురాన్ని నిలబెట్టేందుకు గత నెల 9న ఆమె సోదరుడు అభిషేక్ .. బావ రవి ఇంటికి వెళ్లాడు. చెల్లిని వేధించవద్దని హితవు పలికాడు. అయితే ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది.

ఆవేశంలో ఊగిపోయిన రవి.. అభిషేక్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనలో అభిషేక్ మరణించాడు. అల్లుడ్ని అరెస్టు చేశారు. కూతురు పుట్టింటికి చేరింది. అయితే కొడుకు మరణంతో పాటు కూతురు బతుకు బుగ్గిపాలు అయ్యిందన్న ఆవేదనలో కూరుకుపోయింది తల్లి భాగ్యమ్మ. నిత్యం దీనిపై ఆలోచన చేసింది. చేతికొచ్చిన కొడుకు సొంత బావ చేతిలో మరణించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి, కొడుకుల్ని కొన్ని రోజుల వ్యవధిలో పోగొట్టుకున్నారు ఆ కుటుంబ సభ్యులు. తన వల్లే సోదరుడు, తల్లి కానరాని లోకాలకు వెళ్లిపోయారంటూ తల్లడిల్లిపోతుంది కూతురు. ఈ ఘటనపై విజయనగర పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetbetwooncasibomiptv satın alCasibomcasibom