iDreamPost
android-app
ios-app

అమ్మతనానికి మచ్చ! ప్రియుడితో కలిసి.. మూడేళ్ల చిన్నారిపై దారుణం!

‘అమ్మను మించిన దైవం లేదు’ అంటుంటారు పెద్దలు. కానీ ఈ రోజుల్లో ఈ బంధం కూడా దారుణంగా తయారయ్యింది. కడుపున పుట్టిన బిడ్డల పట్ల తల్లి కఠినంగా వ్యవహరిస్తోంది. ఇదిగో ఈ మహా తల్లి కూడా.. ఆ ఖాతాలోకే వస్తుంది.

‘అమ్మను మించిన దైవం లేదు’ అంటుంటారు పెద్దలు. కానీ ఈ రోజుల్లో ఈ బంధం కూడా దారుణంగా తయారయ్యింది. కడుపున పుట్టిన బిడ్డల పట్ల తల్లి కఠినంగా వ్యవహరిస్తోంది. ఇదిగో ఈ మహా తల్లి కూడా.. ఆ ఖాతాలోకే వస్తుంది.

అమ్మతనానికి మచ్చ! ప్రియుడితో కలిసి.. మూడేళ్ల చిన్నారిపై దారుణం!

బంధాల్లో విలువైనది, గొప్పది.. తల్లి, బిడ్డల బాంధవ్యం. నవ మాసాలు కని, పెంచి పిల్లల్ని..కంటికి రెప్పలా కాపాడుతుంది తల్లి. ఎంత వయస్సు వచ్చినా.. అమ్మకి బిడ్డలెప్పుడు చిన్న పిల్లల లెక్కే. తను కడుపు మాడ్చుకుని.. పిల్లల బొజ్జ నింపుతుంది. తండ్రి మందలించినా.. అడ్డు పడుతుంది. పిల్లల అవసరాలను గుర్తించి.. ఆదుకునే ఏటీఎం ఆమె. అందుకే తల్లిని మించి యోధులు, దైవం లేదు అంటారు పెద్దలు. కానీ కొంత మంది తల్లులు.. అమ్మతనానికి మాయని మచ్చగా నిలుస్తున్నారు. అక్రమ సంబంధాల ముసుగులో అడ్డుగా ఉంటున్న పిల్లల్ని చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. ఇప్పుడు అటువంటి ఓ సంఘటన వెలుగు చూసింది. ఆమె తల్లి కాదూ..కసాయి. ప్రియుడి మోజులో పసిగొడ్డు అని చూడకుండా చితకబాదింది.

ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని హోస్కెరెహళ్లిలో వీర భద్రనగర్ బన శంకరి 3వ ఫేజ్‌లో మూడేళ్ల కుమారుడితో కలిసి ఉంటుంది షరీన్. ఆ భవనంలో మూడో అంతస్తులో నివాసముంటున్నారు ఈ ఇద్దరు. అయితే కుమారుడు స్టాలిన్‌ను ఇంట్లో బంధించి హింసించడం మొదలు పెట్టింది తల్లి. ఆమె రోజు పనికి వెళ్లేటప్పుడు.. ఇంటికి తాళం వేసి వెళ్లిపోయేది. ఈ విషయం చుట్టు ప్రక్కల వారికి తెలిసి.. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు, మహిళా సంఘాలకు సమాచారం అందించగా..స్టాలిన్‌ను రక్షించారు. కానీ తల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఆ శాఖ. అయితే ఆ సమయంలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె భర్తను వదిలిపెట్టి.. ప్రియుడితో ఉంటున్నట్లు తెలుస్తోంది.

ఆ ఇంటికి తరచుగా ఓ వ్యక్తి వస్తున్నాడని తేలింది. బెంగళూరుకు చెందిన షరీన్ కు గతంలో ఓ వ్యక్తితో వివాహం అయ్యింది. అయితే భార్యా భర్తల మధ్య గొడవలు రావడంతో తన కొడుకుతో బయటకు వచ్చేసి.. ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో దినేష్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడి.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న కుమారుడ్ని.. షరీన్ ప్రియుడితో కలిసి చిత్ర హింసలకు గురి చేసింది. మూడేళ్ల బాబుపై తరచూ ప్రియుడితో కలిసి దాడి చేసేది. అతడి కేకలు, ఏడుపులు ఇరుగు పొరుగు విని.. చివరకు మహిళా శిశు శాఖకు ఫిర్యాదు చేశారు. అతడ్ని తల్లి చెర నుండి విడిపించి.. సంరక్షణా కేంద్రానికి తరలించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారి దాఖలు చేసి ఫిర్యాదుపై షరీన్, ప్రియుడిపై కేసు నమోదైంది.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet