iDreamPost
android-app
ios-app

హీరోయిన్ లాంటి భార్య.. ఊరిలో పలుకుబడి.. కానీ భర్త మాత్రం

  • Published Jul 20, 2024 | 6:50 PM Updated Updated Jul 20, 2024 | 6:50 PM

Kodagu.. శిల్పా సీతమ్మ.. బొప్పన్న భార్యా భర్తలు.. శిల్ప హీరోయిన్ లాంటి అందం. ఊరిలో ఆమె తెలియని వారు లేరు. కానీ భర్తకు మాత్రం ఆమె అంటేనే గిట్టదు. పిల్లల కోసం భార్యా భర్తల్లా జీవిస్తున్నారు. కానీ

Kodagu.. శిల్పా సీతమ్మ.. బొప్పన్న భార్యా భర్తలు.. శిల్ప హీరోయిన్ లాంటి అందం. ఊరిలో ఆమె తెలియని వారు లేరు. కానీ భర్తకు మాత్రం ఆమె అంటేనే గిట్టదు. పిల్లల కోసం భార్యా భర్తల్లా జీవిస్తున్నారు. కానీ

  • Published Jul 20, 2024 | 6:50 PMUpdated Jul 20, 2024 | 6:50 PM
హీరోయిన్ లాంటి భార్య.. ఊరిలో పలుకుబడి.. కానీ భర్త మాత్రం

కలకాలం కలిసి ఉంటామని చేసుకుంటున్న ప్రమాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. భార్యా భర్తల బంధాన్ని దంపతులు తమ చేష్టలతో, మాటలతో తెంపుకుంటున్నారు. దీంతో మనస్పర్థలు ఏర్పడుతున్నాయి. మానసికంగా మదనపడుతున్నారు. గొడవలు అవుతున్నా.. పిల్లల కోసం కలిసి ఉండాలన్న ధోరణితో కాపురాన్ని మరింత జఠిలం చేసుకుంటున్నారు. సమస్యను మరింత పెద్దది చేసుకుని ఒకరిపై ఒకరు చంపేంత కక్ష పెంచుకుంటున్నారు. కడకు జీవిత భాగస్వామిని కడతేరుస్తున్నారు. ఇప్పుడు ఇదే జరిగింది కర్ణాటకలో కూడా. అందమైన భార్య. ఊరందరికీ తెలిసిన మహిళ. చాలా పలుకుబడి ఉంది. కానీ భర్తకు ఆమెంటేనే గిట్టదు. మనస్పర్థలు కారణంగా భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని వీర్రాజు పేట శివారులోని బేటోలీ గ్రామంలో నివసిస్తున్నారు భార్యా భర్తలు బోప్పన్న, శిల్పా సీతమ్మ. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. శిల్పా సీతమ్మకు ఈ ఊరిలో పెద్ద మనిషి. గతంలో ఆమె గ్రామ పంచాయతీ సభ్యురాలిగా వర్క్ చేసింది. 2012 నుంచి 2017 వరకు బేటోలి గ్రామపంచాయతీ సభ్యురాలిగా పనిచేసింది. ఆమెకు గ్రామంలో మంచి పలుకుబడి ఉంది. ఇదిలా ఉంటే భార్యా భర్తల మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఒకే ఇంట్లో ఉంటున్న వేర్వేరు కుంపటి. పిల్లల కోసం కలిసి జీవిస్తున్నారు. అయితే తనకు ఖర్చులకు డబ్బులు ఇవ్వాలంటూ శిల్పా కోరగా.. భర్త ససేమీరా చెప్పాడు. దీనిపై ఆమె కోర్టులో కేసు వేసినట్లు కూడా తెలుస్తుంది.

కేవలం పిల్లల కోసమే ఇద్దరు భార్యా భర్తలుగా కలిసి జీవిస్తున్నారు. ఒకే ఇంట్లో ఉంటున్న కంచాలు, మంచాలు వేర్వేరని స్థానికులు అనుకుంటున్నారు. అయితే గత రాత్రి కూడా ఓ విషయంపై భార్యా భర్తల మధ్య గొడవలు జరిగాయి. ప్రతి నెల డబ్బుల కోసం తనను వేధిస్తుందని, ప్రతి విషయంలోనూ ఆమెతో తగాదాలు జరుగుతున్నాయని భావించిన భర్త .. శనివారం ఉదయం.. భార్యను కాల్చి హత్య చేశాడు. అనంతరం వీర్రాజు పేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన భార్యను తానే హత్య చేశానని చెప్పాడు. కాగా, కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడు బోప్పన్నను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş