iDreamPost
android-app
ios-app

భార్య సంతోషంగా ఉండటం చూడలేక భర్త దారుణం! నమ్మించి మరీ!

  • Published Jul 20, 2024 | 4:00 AM Updated Updated Jul 20, 2024 | 4:00 AM

నవీన్, అన్నపూర్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చిలకా, గోరింకల్లా జీవించేవారు. ఈ ముచ్చటైన జంటకు ఓ చిన్నారి కూడా పుట్టింది. అంతలో భర్తలో మార్పు చోటుచేసుకుంది. భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో పుట్టింటికి వెళ్లిపోయింది.

నవీన్, అన్నపూర్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చిలకా, గోరింకల్లా జీవించేవారు. ఈ ముచ్చటైన జంటకు ఓ చిన్నారి కూడా పుట్టింది. అంతలో భర్తలో మార్పు చోటుచేసుకుంది. భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో పుట్టింటికి వెళ్లిపోయింది.

  • Published Jul 20, 2024 | 4:00 AMUpdated Jul 20, 2024 | 4:00 AM
భార్య సంతోషంగా ఉండటం చూడలేక భర్త దారుణం! నమ్మించి మరీ!

ప్రేమలో ఉన్నప్పుడు ఉండే లవ్ అండ్ కేరింగ్.. పెళ్లి తర్వాత ఉండటం లేదు.  పెళ్లి కాక ముందు ఇప్పుడు భార్య ప్లేసులో ఉన్న ప్రియురాలి కోసం, ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు ముప్పతిప్పలు పడే ప్రియుడు.. మూడు ముళ్లు పడ్డాక భార్యను లైట్ తీసుకుంటున్నాడు. ఇదే ఇద్దరి మధ్య మనస్పర్థలకు దారి తీస్తున్నాయి. పెళ్లి తర్వాత ప్రేమను కోల్పోయానన్న బాధలో ఉంటుంది భార్య. దీంతో గొడవలు, తగాదాలు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు. చివరకు ఎందుకు ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్నామురా దేవుడా అని.. ఏ ప్రేమ కోసమైతే అగచాట్లు పడ్డారో.. పెళ్లయ్యాక.. ఈ బంధాన్ని తెంచేసుకుంటున్నారు. మరికొంత మంది అయితే దారుణాలకు, అకృత్యాలకు పాల్పడుతున్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న  భార్య.. తనను వదిలేసి సుఖంగా పుట్టింట్లో బతుకుతుందని ఆలోచన చేసిన భర్త  అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. భార్యతో పాటు అత్త మామల్ని పొట్టన పెట్టుకున్నాడు. ఈ  ఘటన కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి తాలూకాలోని సైదాపూర్ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దావణగెరెకు చెందిన బసవరాజప్ప, కవితల కుమార్తె అన్నపూర్ణను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నవీన్. వీరి కాపురం పెళ్లైన కొత్తలో మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగింది. మంచి అల్లుడు దొరికాడని సంబరపడిపోయారు అత్తామామలు. కానీ ఆ ఆనందం ఎంతకాలం నిలువ లేదు. నవీన్, అన్నపూర్ణలకు పాప పుట్టింది. ఆ తర్వాత మెల్లిగా గొడవలు స్టార్ట్ అయ్యాయి.  భర్త వేధింపులతో విసిరి వేసారి పోయిన అన్నపూర్ణ పుట్టింటికి వచ్చేసింది. తిరిగి భర్త నవీన్ దగ్గరకు వెళ్లలేదు.

ఏడాది కాలంగా తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుంది. అయితే నన్ను వదిలేసి భార్య ఒంటరిగా ఉంటుందని, ఆమె సంతోషంగా బతుకుతుందని భావించిన నవీన్..  ఆమెను అంతమొందించాలని అనుకున్నాడు. దీని కోసం మాస్టర్ ప్లాన్ వేశాడు.  భార్యను కాపురానికి తీసుకెళ్లే విషయమై మాట్లాడేందుకు అత్తారింటికి వెళ్లాడు.  కొందరు పెద్దలు కలసి పంచాయితీ చేసి కూతురిని కొన్ని షరతులతో తనతో ఇంటికి పంపడానికి అంగీకరించారు. కూతురు అన్నపూర్ణను తల్లిదండ్రులిద్దరూ యాదగిరిలోని భర్త ఇంట్లో కూతురిని దింపేందుకు వచ్చారు. ఈ సమయంలో అల్లుడు.. కారులో  బస్‌ స్టేషన్‌కు వదిలిపెడతానని చెప్పి. . ముగ్గుర్ని తీసుకెళ్లి.. ఇనుప రాడ్డుతో దాడి చేసి అనంతరం కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం మూడు మృతదేహాలను ఓ గ్రామ సమీపంలో పడేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరపగా.. అల్లుడే ఈ హత్యలకు కారణమైనట్లు తెలిసింది. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio