iDreamPost
android-app
ios-app

దారుణం.. పెళ్లైన 5 నెలలకే భార్యను అతి కిరాతకంగా..

  • Published Jul 08, 2024 | 6:02 PM Updated Updated Jul 08, 2024 | 6:02 PM

ఆడ పిల్లను ఎంతో అపురూపంగా పెంచుకున్న తల్లిదండ్రులు కూతురికి ఓ ఈడు వచ్చాక ఓ అయ్య చేతిలో పెడతారు. కట్నకానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేసి పంపుతారు. కానీ కొంత మంది అల్లుళ్లు.. తిరిగి కూతుళ్లను అప్పగిస్తున్నారు.. అయితే సజీవంగా కాదు..

ఆడ పిల్లను ఎంతో అపురూపంగా పెంచుకున్న తల్లిదండ్రులు కూతురికి ఓ ఈడు వచ్చాక ఓ అయ్య చేతిలో పెడతారు. కట్నకానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేసి పంపుతారు. కానీ కొంత మంది అల్లుళ్లు.. తిరిగి కూతుళ్లను అప్పగిస్తున్నారు.. అయితే సజీవంగా కాదు..

  • Published Jul 08, 2024 | 6:02 PMUpdated Jul 08, 2024 | 6:02 PM
దారుణం.. పెళ్లైన 5 నెలలకే భార్యను అతి కిరాతకంగా..

ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంటారు అమ్మాయిలు. తన భర్త అడుగు జాడల్లో నడవాలని భావిస్తే.. తన మాటకు విలువనివ్వాలని ఆరాటపడుతుంటారు. తన భవిష్యత్తు, పిల్లలు గురించి ఎన్నో కలలుకంటూ ఉంటుంది. సంసారాన్ని ఇలా చేసుకోవాలని, ఇలా చేసుకోవాలని ఎన్నో ఊహించుకుంటూ ఉంటుంది. కానీ అపార్థాలు, అనుమానాలు, అవమానాలు వివాహ బంధాలు ఆదిలోనే హంసపాదుగా మారిపోతున్నాయి. ఒకరంటే ఒకరికి గిట్టదు. సమాజం దృష్టిలో భార్యా భర్తల్లా నటిస్తూ..ఇంట్లో మాత్రం బద్ద శత్రువుల్లా జీవిస్తుంటారు. చివరకు చినికి చినికి గాలి వానగా మారినట్లు.. ఈ సంసార బంధం కూడా ఎటువంటి దారుణ పరిస్థితులకైనా దారి తీయొచ్చు. అందుకు ఉదాహరణ ఈ ఘటనే.

పెళ్లి జరిగి ఐదు నెలలు అయ్యిందో లేదో.. నవ వధువు హత్యకు గురైన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కల్బుర్గిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసముంటుంది ఉమేష్ కుటుంబం. ఉమేష్, రంజితకు 5 నెలల క్రితమే వివాహం అయ్యింది. రంజిత్ నీటి పారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి గవర్నమెంట్ ఉద్యోగం కావడంతో బోలెడంత కట్న కానులకు ఇచ్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. పెళ్లైన నాటి నుండే రంజితకు అత్తింట్లో సమస్యలు ఎదురయ్యాయి. అయితే అనూహ్యంగా ఆమె హత్యకు గురైంది. విషయం తల్లిదండ్రులకు తెలిసి.. పోలీసులకు సమాచారం అందించారు. బంగారం లాంటి పిల్లను అల్లుడు చేతిలో పెడితే.. తమకు ఇలా అప్పగించాడని కన్నీరుమున్నీరు అవుతున్నారు.

కట్న, కానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేసి పంపిస్తే.. ఐదు నెలలకే విగత జీవిగా రావడంతో తట్టుకోలేక పోతున్నారు రంజిత పేరెంట్స్. పెళ్లైన నాటి నుండి ఆమెను మానసికంగా, శారీరకంగా హింసకు గురి చేశారని, అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించారని వాపోతున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రంజిత భర్త, అత్త, మామలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పారాణి ఇంకా ఆరనేలేదు.. తోరణాలు వాడనేలేదు.. 5 నెలలకే ఆమెకు నరకం చూపిన అత్తింటి వారు… చివరకు హత్య చేసి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio