iDreamPost
android-app
ios-app

పెళ్లై 12 ఏళ్లు అయ్యింది.. భర్త, మరిది కలిసి..

ఆడ పిల్లను పెంచి పెద్ద చేయడం కన్నా.. ఓ ఇంటికి పంపేందుకు అష్టకష్టాలు పడుతుంటారు పెద్దలు. కూతుర్ని బాగా చూసుకునే తల్లిదండ్రులు.. పెళ్లీడు రాగానే.. ఓ వరుడ్ని వెతికి అప్పగిస్తుంటారు. అక్కడితో సమస్య ముగిసిపోదు.

ఆడ పిల్లను పెంచి పెద్ద చేయడం కన్నా.. ఓ ఇంటికి పంపేందుకు అష్టకష్టాలు పడుతుంటారు పెద్దలు. కూతుర్ని బాగా చూసుకునే తల్లిదండ్రులు.. పెళ్లీడు రాగానే.. ఓ వరుడ్ని వెతికి అప్పగిస్తుంటారు. అక్కడితో సమస్య ముగిసిపోదు.

పెళ్లై 12 ఏళ్లు అయ్యింది..  భర్త, మరిది కలిసి..

ఆడ పిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని కంటికి రెప్పలా కాచి కాపాడుకుంటారు తల్లిదండ్రులు. అమ్మాయి ఏడిస్తే.. ఇంటికి మంచి కాదని ఆమెకు ఎలాంటి బాధ తెలియకుండా పెంచుతారు. కూతురు కోరిందల్లా ఇస్తూ.. ఆమె మాటకు విలువ ఇస్తూ.. దేవతలా చూసుకుంటారు. ఇక పెళ్లీడు వచ్చాక.. ఓ అయ్య చేతిలో పెడుతుంటారు. ఓ సంబంధం చూసి.. కట్న కానుకలు ఇచ్చి వివాహం చేస్తారు. పెళ్లయ్యాక పురుడు, ఇతర బారసాలలు అంటూ ఆ బాధ్యతలను కూడా తీసుకుంటారు పేరెంట్స్. కానీ పుట్టింటి నుండి అత్తింటికి వచ్చి.. తమ ఇంటి పేరు తీసుకున్న కోడలిని మాత్రం ఓ పనిమనిషిగా, పరాయి వ్యక్తిగా ట్రీట్ చేస్తుంటారు కొంత మంది అత్తింటి వారు. అదీ చాలదన్నట్లు..మరింత డబ్బులు తీసుకురావాలంటూ..వేధిస్తుంటారు.

అటు తల్లిదండ్రులను సర్ది చెప్పుకోలేక.. అటు అత్తారింట్లో ఆరళ్లు తట్టుకోలేక.. పిల్లల ముఖాలు చూసి బ్రతుకు ఈడుస్తుంటారు. కానీ ఆ వేధింపులు ఎక్కువైతే.. చివరకు తట్టుకోలేక ఇలాంటి డబ్బు పిశాచుల మధ్య నుండి తప్పించుకునేందుకు బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ మహిళ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది. కట్నం వేధింపులు తట్టుకోలేక విజయలక్ష్మి అనే మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైసూరు తాలుకా బొమ్మనహళ్లికి చెందిన విజయలక్ష్మిని నంజనగూడు తాలూకాలోని హోసకోటెకు చెందిన హరీష్‌కు ఇచ్చి వివాహం చేశారు. కొంత కట్నంతో పాటు బంగారం ఇచ్చారు.

పెళ్లై 12 సంవత్సరాలు అవుతున్నప్పటికీ.. అదనపు కట్నం కోసం అత్త మల్లిగమ్మ, మామ మహాదేవ మూర్తి, మరిది రాఘవేంద్రలు వేధించేవారు. పలుమార్లు వేధిస్తుంటే..పంచాయతీ పెట్టి సర్ది చెప్పారు. అయినా భర్త, అతడి కుటుంబ సభ్యులు వేధిస్తుండేవారు. రాను రానూ ఈ వేధింపులు ఎక్కువయ్యాయి. దీంత తట్టుకోలేక విజయలక్ష్మి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. కూతురు మరణించిందని తెలిసే సరికి కన్నీరుమున్నీరు అయ్యారు కుటుంబ సభ్యులు. ఆమె మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు భర్త, అత్త, మరిదిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Giriş