iDreamPost
android-app
ios-app

రాత్రి అయితే భార్యకి టార్చర్! ఆ పని చేయాలంటూ! వీడేం భర్తరా బాబు!

  • Published Mar 27, 2024 | 4:27 PM Updated Updated Mar 27, 2024 | 4:33 PM

ఈ దంపతులను చూసి చూడ ముచ్చటైన జంట అనుకునే వారంతా. కానీ అనూహ్యంగా ఓ రోజు భార్య ఊహించని రీతిలో కనిపించింది. వెంటనే ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసిన అల్లుడు..

ఈ దంపతులను చూసి చూడ ముచ్చటైన జంట అనుకునే వారంతా. కానీ అనూహ్యంగా ఓ రోజు భార్య ఊహించని రీతిలో కనిపించింది. వెంటనే ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసిన అల్లుడు..

  • Published Mar 27, 2024 | 4:27 PMUpdated Mar 27, 2024 | 4:33 PM
రాత్రి అయితే భార్యకి టార్చర్! ఆ పని చేయాలంటూ! వీడేం భర్తరా బాబు!

ఆ భార్యా భర్తలను చూసి చిలకా-గోరింకల్లా ఉన్నారని స్థానికులు పొగుడుతూ ఉండేవారు. అందమైన భార్య, అందుకు తగ్గట్లుగా భర్త. ఇద్దరికీ ఈడు జోడు బాగా కుదిరిందని అనుకునేవారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ పదం ఈ జంటను చూసే వచ్చిందేమో అనుకునేలా..ఇంకొంత మంది దంపతులకు ఈర్ష, ద్వేషాలతో పాటు భార్యా భర్తలు ఇలా ఉండాలి అనేలా కనిపించారు. కానీ ఓ రోజు అనూహ్యంగా భార్య ఆత్మహత్య చేసుకుంది. ఇదేంటమ్మా.. నిన్నటి వరకు బాగానే ఉంది కదా.. ఇప్పుడు ఇలా చేసిందేమిటీ అంటూ గుస గుసలాడారు. కానీ తల్లిదండ్రులు వచ్చాక కానీ అసలు నిజం తెలియదు. బయటకు మంచిగా కనిపించిన ఆ మనిషి లోపల మరో మానవ మృగం దాగి ఉందని. ఊర్లో ప్రజల ముందు భార్యను బాగా చూసుకున్నట్లు నటించిన భర్తే.. ఆమెకు కాలయముడయ్యాడని.

కర్ణాటకలోని విషాదం చోటుచేసుకుంది. రాత్రి ఫోనులో బాగానే మాట్లాడిన కూతురు తెల్లారే శవమై కనిపించే సరికి కన్నీరు మున్నీరు అవుతున్నారు. తన కూతుర్ని అల్లుడే చంపి ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరిస్తున్నాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంతకు అసలు ఏం జరిగిందంటే… చిక్క మగళూరులోని గవేనహళ్లికి చెందిన శుభ.. హాసన్ తాలూకా ఉద్దూరు కొప్పలుకు చెందిన సునీల్‌కు మూడున్నరేళ్ల క్రితం వివాహం జరిగింది. అతడు రైతు అయిప్పటికీ.. కట్న కానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. వీరికి ఓ కుమారుడు పుట్టాడు. బయటకు భార్యను బాగా చూసుకుంటున్నట్లు నటించే ఈ వ్యక్తి.. ఇంట్లో మాత్రం మరింత కట్నం తీసుకురావాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. రాత్రి అయితే చాలు ఈ విషయంపై తరచూ శుభను కొట్టేవాడు. ఆ బాధను పంటిబిగువున పెట్టుకుంది ఇల్లాలు.

కూతురు తల్లిదండ్రులకు ఏమీ చెప్పేది కాదూ.దీంతో ఆమె కాపురం బాగుందని భావించారు. కానీ మంగళవారం శుభ తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని, ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పాడు అల్లుడు సునీల్. హుటా హుటిన అక్కడకు వెళ్లగా.. ఆమె మరణం అనుమానాస్పదంగా తోచింది. అంతకుముందు రోజే తనతో బాగా మాట్లాడిందని, ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం ఏంటనీ.. మృతురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. అల్లుడే ఆమెను చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తుంది. కాగా, పిల్లాడిని అడిగితే.. గత రాత్రి అమ్మను తండ్రి కొట్టాడని చెప్పడంతో అనుమానాలు బలపడ్డాయి. వీటికి తోడు శరీరంపై గాయాలు ఉండటం, భర్తను మందు అలవాటు ఉండటంతో అతడే చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి తన కుమార్తె మృతికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetGalabetfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş