iDreamPost
android-app
ios-app

బంగారం లాంటి భార్య వచ్చినా.. అతని బుద్ది మారలేదు! చివరికి..

  • Published Feb 14, 2024 | 6:20 PM Updated Updated Feb 14, 2024 | 6:20 PM

ఆడ పిల్లలు, కని, పెంచి పెద్ద చేస్తున్న తల్లిదండ్రులు.. పెళ్లి చేసి పరాయి ఇంటికి పంపిస్తారు. అక్కడ ఆమెకు ఏదైనా బాధ వస్తే మాత్రం సర్దుకుపో అంటూ నచ్చ చెబుతుంటారు. కూతురి వేదనను అర్థం చేసుకోకపోగా..

ఆడ పిల్లలు, కని, పెంచి పెద్ద చేస్తున్న తల్లిదండ్రులు.. పెళ్లి చేసి పరాయి ఇంటికి పంపిస్తారు. అక్కడ ఆమెకు ఏదైనా బాధ వస్తే మాత్రం సర్దుకుపో అంటూ నచ్చ చెబుతుంటారు. కూతురి వేదనను అర్థం చేసుకోకపోగా..

  • Published Feb 14, 2024 | 6:20 PMUpdated Feb 14, 2024 | 6:20 PM
బంగారం లాంటి భార్య వచ్చినా.. అతని బుద్ది మారలేదు! చివరికి..

జీవితంలో సుఖ దుఖాలు ఉంటాయి. ఒడిదుడుకులు, సమస్యలు, అడ్డంకులు, అవరోధాలు ఎదురౌతాయి. అనేక సవాళ్లు మనల్ని పరీక్ష పెడతాయి. భరించలేని బాధను అందిస్తాయి. లైఫ్ అంటే అసహ్యం కలిగించే సంఘటనలు ఆవిర్బవిస్తూ ఉంటాయి. కష్టాలు అంటే కడదాకా ఉండిపోవు. వాటిని ఎదురీదుతూ ముందుకు సాగాలి. అప్పుడే జీవిత పాఠాల నుండి గుణ పాఠాలు నేర్చుకోగలుగుతాం.  ముఖ్యంగా పెళ్లైన మహిళలు.. మరింత ధైర్యాన్ని.. ఆత్మ స్తైర్యాన్ని పెంపొందించుకోగలగాలి. అలా కాదని ఆవేశంలో, కోపంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే.. సమస్యలు పరిష్కారం కావు. ఇబ్బందులకు తలవంచితే.. అవే మనల్ని మింగేస్తాయి.

అత్తారింట్లో పెట్టే ఆరళ్లు తట్టుకోలేక ఓ ఇల్లాలు క్షణికంలో కఠిన నిర్ణయం తీసుకుంది. తన కూతురిని చంపి.. ఆమె హత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని కలుబుర్గి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చించోల్లి తాలూకాలోని కెరొల్లి గ్రామానికి చెందిన శివలీల, మారపల్లి గ్రామ వాసి ఆనంద్‌తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కూతురు పుట్టింది. ఆమెకు వర్షిత అని నామకరణ చేయగా.. ప్రస్తుతం పాప వయస్సు రెండు సంవత్సరాలు. కొన్ని రోజులు వీరి కాపురం సజావుగా సాగిపోయిన ఇటీవల భర్త, అత్త కలిసి శివలీలను వేధించడం మొదలు పెట్టారు. ఈ వేధింపులు తట్టుకోలేక అత్తారింట్లో నుండి పుట్టింటికి వెళ్లిపోయింది

అయితే తన తప్పై పోయిందని.. మరోసారి గొడవ పడనని, తిరిగి వచ్చేయాలని భార్యను బతిమాలాడుకున్నాడు భర్త ఆనంద్. ఆమె పుట్టింటికి వెళ్లి .. భార్య శివలీలను తిరిగి తన ఇంటికి తీసుకువచ్చాడు. ఇలా అత్తారింటికి వెళ్లాక శివలీల వేధింపులు తగ్గకపోవడంతో పాటు మరింత పెరగ్గా.. ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుంది. పాప వర్షితను హత్య చేసి.. ఆమె ఆత్మహత్య చేసుకుంది. కడుపున పుట్టిన బిడ్డ ఆవేశంలో చంపి.. శివలీల కూడా ఆ ఉరికొయ్యకు వేలాడింది. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చించోల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు భర్త ఆనంద్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet