iDreamPost
android-app
ios-app

నువ్వు ఓ తల్లివేనా.. ప్రియుడితో సుఖం కోసం అలాంటి బిడ్డను

  • Published Feb 10, 2024 | 11:31 AM Updated Updated Feb 10, 2024 | 11:31 AM

‘అమ్మను మించిన దైవమున్నదా..’ అని తల్లి గురించి ఓ సినీ కవి చెప్పినట్లుగా.. అమ్మే పిల్లలకు ఆల్ ఇన్ వన్. కానీ నేటి సమాజంలో కొంత మంది తల్లులు.. పిల్లల గురించి ఆలోచించకుండా తమ సుఖం కోసం తాపత్రయపడుతున్నారు. ఇదిగో.. ఈ మహాతల్లి కూడా..

‘అమ్మను మించిన దైవమున్నదా..’ అని తల్లి గురించి ఓ సినీ కవి చెప్పినట్లుగా.. అమ్మే పిల్లలకు ఆల్ ఇన్ వన్. కానీ నేటి సమాజంలో కొంత మంది తల్లులు.. పిల్లల గురించి ఆలోచించకుండా తమ సుఖం కోసం తాపత్రయపడుతున్నారు. ఇదిగో.. ఈ మహాతల్లి కూడా..

  • Published Feb 10, 2024 | 11:31 AMUpdated Feb 10, 2024 | 11:31 AM
నువ్వు ఓ తల్లివేనా.. ప్రియుడితో సుఖం కోసం అలాంటి బిడ్డను

తల్లిని మించిన గురువు, దైవం లేదు ఈ లోకంలో. తన కడుపున పుట్టిన ఆడ పిలైనా, మగవాడైనా ఆమెకు సమానమే. పిల్లల్లో తారతమ్యాలు వెతకుండా ప్రేమ పంచుతుంది అమ్మ. అంగ వైక్యంతో పుట్టిన బిడ్డను కూడా ఆమె వదిలేయదు. జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకునేందుకు సిద్ధం అయిపోతుంది. అవసరమైతే కాలానికి, కుటుంబానికి సమాధానం చెబతుంది. వారి కోసం తన ఆనందాన్ని కూడా త్యాగం చేస్తుంది. అలాంటి పిల్లలకు జీవితాంతం సేవ చేసే ఎంతో మంది తల్లులు ఉన్నారు ఈ లోకంలో.  కానీ ఈ తాటకి మాత్రం నీచాతి నీచమైన దారుణానికి ఒడిగట్టింది. తల్లి అనే పదానికి మాయని మచ్చలా మారింది. పరాయి మగాడితో సుఖం కోసం కూతుర్ని కడతేర్చిన కసాయి తల్లి ఈమె.

ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ధార్వాడ జిల్లాలోని కమలా పుర ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జ్యోతి అనే మహిళ భర్తకు విడాకులు ఇచ్చి దూరంగా ఉంటుంది. ఆమెకు ఇద్దరు కవల పిల్లలు. వారిలో సహనా హిరేమత్ అంగ వైకల్యంతో జన్మించింది. జ్యోతి తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తుంది. అయితే ఆమెకు హుబ్లీలోని నవనగర్‌కు చెందిన జెనెకర రాహుల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. అతడితో కలిసి జీవించేందుకు సిద్ధమైంది. అయితే ఇందులో సహనా ఆమెకు ఇబ్బందిగా మారింది. ప్రత్యేక ప్రతిభావంతురాలు కావడం, ఆమెకు భారంగా మారడంతో 5 ఏళ్ల పాప అడ్డు తొలగించుకోవాలని అనుకుంది తల్లి.

ఇదే ధ్యాసలో ఉన్న తల్లి జ్యోతి.. ఇంట్లో ఉన్న కూరగాయల కత్తితో పాప గొంతుకోసింది. అభం, శుభం తెలియని సహనా చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేరంలో భాగస్వామ్యమైనందుకు జ్యోతి ప్రియుడు రాహుల్‌ను కూడా అరెస్టు చేశారు. కాగా, ప్రాథమిక విచారణలో కూతుర్ని హత్య చేయడంపై కారణాలు వెల్లడించిందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు తల్లి జైలుకు పోవడంతో మరో పాప అనాథగా మారిపోయింది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio