iDreamPost
android-app
ios-app

భార్య మద్యానికి అలవాటు పడిందని భర్త దారుణం.. కానీ

తండ్రి కొడుకుల బాండింగ్ కన్నా.. తల్లి, కొడుకుల బంధం చాలా గొప్పది. సున్నితమైనది. అమ్మను తండ్రి ఒక మాట అన్నా సహించడు, భరించడు. తిరిగి తండ్రిపై రివర్స్ అయ్యే కొడుకులున్నారు. కానీ ఈ మహా ఇల్లాలు మాత్రం..

తండ్రి కొడుకుల బాండింగ్ కన్నా.. తల్లి, కొడుకుల బంధం చాలా గొప్పది. సున్నితమైనది. అమ్మను తండ్రి ఒక మాట అన్నా సహించడు, భరించడు. తిరిగి తండ్రిపై రివర్స్ అయ్యే కొడుకులున్నారు. కానీ ఈ మహా ఇల్లాలు మాత్రం..

భార్య మద్యానికి అలవాటు పడిందని భర్త దారుణం.. కానీ

ఇంటికి దీపం ఇల్లాలు అంటారు పెద్దలు. ఇల్లును చూస్తే.. ఇల్లాలు ఎలా ఉంటుందో అంచనా వేస్తుంటారు ఇంటికొచ్చిన బంధువులు. కానీ ఈ రోజుల్లో కొంత మహిళలు.. తాళి కట్టిన భర్తను, కడుపున పుట్టిన బిడ్డను గాలికొదిలేస్తున్నారు. అత్తమామలను, బిడ్డల్ని చూసుకుంటూ.. కట్టుకున్న వాడికి ప్రతి విషయంలో అండగా ఉండాల్సిన అతివలు బాధ్యత తప్పి నడుస్తున్నారు. తమ జీవితం తమకు నచ్చినట్లు బ్రతకాలని జల్సాలకు అలవాటు పడుతున్నారు. దీంతో తల్లి మమకారానికి, ప్రేమకు దూరం అవుతున్నారు పిల్లలు. అమ్మ చేతి గోరు ముద్దలు తినాలని, ఆమెతో ముచ్చట్లు చెప్పాలని, సంతోషంగా ఉండాలని భావిస్తున్నారు చిన్నారులు. కానీ తల్లి వక్రదారి పడితే.. ఇదిగో ఈ స్టోరీ ఓ సారి చదవండి.

కర్ణాటక రాజధాని బెంగళూరులోని కేఆర్ పురాలో నివాసముంటున్నారు భార్యా భర్తలు నేత్రావతి, చంద్రప్ప. వీరికి ఓ 17 ఏళ్ల కుమారుడు. అతడు ప్రస్తుతం డిప్లొమా చదువుతున్నాడు. అయితే ఓ రోజు అమ్మను చంపేశానంటూ పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. టిఫిన్ విషయంలో తన తల్లితో గొడవ జరిగిందని.. దీంతో ఆమెను రాడ్‌తో కొట్టి చంపేసినట్లు నేరం అంగీకరించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నేత్రావతి మృతదేహాన్ని, కొడుకును అదుపులోకి తీసుకున్నారు. ఫోరెన్సిక్ విచారణలో హత్యకు ఉపయోగించిన రాడ్‌పై రెండు రకాల వేలి ముద్రలు ఉండటాన్ని గమనించారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారణ ముమ్మురం చేశారు. రాడ్ ను ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీకి పంపగా.. రాడ్‌పై తండ్రీ కొడుకుల వేలి ముద్రలు ఉన్నట్లు తేలింది.

The husband is angry that his wife is addicted to alcohol

వెంటనే భర్త చంద్రప్పను పోలీసులు అరెస్టు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన కుమారుడు, తాను కలిసి నేత్రావతిని హత్య చేసినట్లు చెప్పారు. అయితే నేరం తండ్రి మీద పడకూడదన్న ఉద్దేశంతో.. కొడుకు మొత్తం నేరాన్ని తన మీద వేసుకున్నాడని తేలింది. భర్త చెప్పిన వివరాల ప్రకారం.. ‘నా భార్య విపరీతంగా మద్యం సేవించేది. ఆమెకు మరొకరితో వివాహేతర సంబంధం ఉంది. రెండు మూడు రోజులైనా ఇంటికి వచ్చేది కాదూ. ప్రతి విషయంలోనూ వారితో కలిసి గొడవ పడేది. దీంతో ఆమెను చంపేయాలని నేను, నా కొడుకు నిర్ణయించుకున్నాం. అలా నేత్రావతిని చంపేశాం. నాపై నేరం రాకూడదని నా కుమారుడు.. మొత్తం నేరాన్ని తనపై వేసుకున్నాడు. హత్య జరిగాక.. నేను పారిపోయాను. నా కుమారుడు పోలీసులకు లొంగిపోయాడు’ అని వెల్లడించాడు చంద్రప్ప.

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomjojobetmariobetMadridbetbetcio güncelmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet güncel girişjojobet giriş