iDreamPost
android-app
ios-app

భార్యని జాతరలో బలిచ్చిన భర్త! రోడ్లపై అరుస్తూ వీరంగం!

ఐదేళ్లకొకసారి జరిగే గ్రామ దేవత జాతర కావడంతో ఊరిలో బంధువులు, చుట్టాల రాకతో సందడి నెలకొంది . పచ్చని తోరణాలు, రంగ వల్లులతో ప్రతి ఇల్లు కళకళలాడుతోంది. జాతరకు ర్యాలీగా బయలు దేరారు ప్రజలు.. అంతలో..

ఐదేళ్లకొకసారి జరిగే గ్రామ దేవత జాతర కావడంతో ఊరిలో బంధువులు, చుట్టాల రాకతో సందడి నెలకొంది . పచ్చని తోరణాలు, రంగ వల్లులతో ప్రతి ఇల్లు కళకళలాడుతోంది. జాతరకు ర్యాలీగా బయలు దేరారు ప్రజలు.. అంతలో..

భార్యని జాతరలో బలిచ్చిన భర్త! రోడ్లపై అరుస్తూ వీరంగం!

ఆ ఊరిలో జాతర జరుగుతుంది. ఐదు సంవత్సరాల కొకసారి గ్రామ దేవత జాతర కావడంతో వేరో ప్రాంతాలకు వెళ్లిన వారు..స్వస్థలానికి చేరుకున్నారు.ఈ వేడుకలను తిలకించేందుకు వచ్చిన బంధువులు, చుట్టాలతో ప్రతి ఇళ్లు కళకళలాడుతుంది. పచ్చని తోరణాలు, ఇల్లంతా రంగవల్లులతో పండగ వాతావరణం సంతరించుకుంది. గ్రామ దేవతకు సమర్పించేందుకు కోళ్లు, మేకలు, పొట్టేళ్లు సిద్దం చేసుకున్నారు. జాతర రోజు రానే వచ్చింది. అమ్మవారికి సమర్పించేందుకు పొంగళ్లు, పొట్టేలతో జాతరగా బయలుదేరారు గ్రామస్థులు. పిల్లలు, పెద్దలు కొత్త బట్టలు ధరించి.. అమ్మవారి దగ్గరకు వెళుతున్నారు. సందడిగా సాగిపోతున్న ఆ జాతరలో ఒక్కసారిగా అలజడి. భార్యను పొట్టనబెట్టుకున్నాడు ఓ కసాయి భర్త.

దేవతకు ఎవరైనా కోళ్లు, పొట్టేళ్లు బలి ఇస్తారు.. కానీ ఈ భర్త భార్యను అర్పించాడు. భార్యను చంపి.. అమ్మవారికి బలిఇచ్చానంటూ కేకలు వేశాడు ఆ భర్త. ఈ ఘటన కర్ణాటకలోని దావణగెరె తాలూకా శిరంగొండన హళ్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హనుమంత.. అర్పితా భార్యా భర్తలు. అర్పితకు తల్లిదండ్రులు లేరు. మేనత్త దగ్గర పెరిగింది. ఆ క్రమంలో హనుమంతుతో పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారింది. వీరిద్దరూ వేర్వేరు కులాలు అయినప్పటికీ.. పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగా సాగిపోయింది. అయితే ఇటీవల భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు మొదలయ్యాయి. దీంతో అతడు మద్యానికి బానిస అయ్యాడు.

భార్య తీరుతో విసుగుపోయిన అతడు ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఐదేళ్లకొకసారి ఊడసలమ్మ కత్తి దుర్గాంబిక దేవి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఊరు ఊరంతా ఆ ధ్యాసలో ఉండగా.. హనుమంతు తప్పతాగి రచ్చ రచ్చ చేసి.. ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడి.. ఆమెను చంపేశాడు. అనంతరం భార్యను గ్రామ దేవతకు బలి ఇచ్చానంటూ అరుచుకుంటూ పరుగులు పెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పరిశీలించగా.. చెవిలో నుండి రక్తం కారడాన్ని గమనించారు. తలపై కొట్టడంతోనే ఆమె చనిపోయిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. జాతరలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది గ్రామం.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet