iDreamPost
android-app
ios-app

కన్నప్రేమను మర్చిపోయి.. కుమార్తెను అంతం చేసిన తండ్రి.. కారణమిదే

పిల్లల్ని ఎంతో ప్రేమించి, వారి కోసం అహర్నిశలు శ్రమించి, ఎన్నో త్యాగాలు చేస్తుంటారు తల్లిదండ్రులు. కడుపున పుట్టిన బిడ్డలు సంతోషంగా ఉండాలని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ ప్రేమ, పెళ్లి విషయానికి వచ్చే సరికి మాత్రం..

పిల్లల్ని ఎంతో ప్రేమించి, వారి కోసం అహర్నిశలు శ్రమించి, ఎన్నో త్యాగాలు చేస్తుంటారు తల్లిదండ్రులు. కడుపున పుట్టిన బిడ్డలు సంతోషంగా ఉండాలని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ ప్రేమ, పెళ్లి విషయానికి వచ్చే సరికి మాత్రం..

కన్నప్రేమను మర్చిపోయి.. కుమార్తెను అంతం చేసిన తండ్రి.. కారణమిదే

భారత్ వసుదైక కుటుంబమే అయినప్పటికీ.. కులాలు, మతాలు, ఆస్తి, అంతస్థులు అంటూ కొట్టుకు చస్తున్నారు. గతంతో పోలిస్తే..ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగుపడినప్పటికీ.. ఆ ఒక్క విషయంలో మాత్రం గిరిగీసుకుని కూర్చుంటున్నారు. అదే ప్రేమ. మరో కులం, మతం వ్యక్తితో స్నేహం చేయి కానీ ప్రేమ, పెళ్లికి మాత్రం నో అంటున్నారు. ముఖ్యంగా అమ్మాయి కుటుంబ సభ్యులు.. తమ కన్నా తక్కువ స్థాయి లేదా మరొక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించినా, పెళ్లాడినా సహించడం లేదు. కన్నతండ్రే కూతురు జీవితంతో చెలగాటమాడుతున్నాడు. తాము కాదన్న వ్యక్తిని మనువాడినా.. తాము తెచ్చిన సంబంధం చేసుకోకపోయినా.. పెద్దలను ఎదిరించినా  పరువే ముఖ్యమని భావించి.. కడుపున పుట్టిన బిడ్డల్ని సైతం కడతేర్చేందుకు వెనుకాడటం లేదు.

తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ పరువు హత్య సినిమాను తలదన్నేలా ఉంది. కూతుర్ని చంపి.. గడ్డివాములో తగులబెట్టాడో కిరాతక తండ్రి. కొన్ని నెలలు క్రితం జరిగిన ఈ హత్య కొన్ని నెలల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మరవేమన గ్రామానికి చెందిన రవికి కుమార్తె అర్పిత.. ఓ యువకుడ్ని ప్రేమించింది. ఈ విషయం తండ్రికి తెలిసి.. నరసాపురం ఫిర్కా ఓడి కృష్ణా పుర గ్రామానికి చెందిన ఒక యువకునికి ఇచ్చి వివాహం చేశాడు. అయితే భర్తతో కలిసి కాపురం చేసేందుకు ఇష్టపడలేదు. మీ కుమార్తె తనతో సరిగా సంసారం చేయడం లేదంటూ అల్లుడు.. మామయ్యకు పలుమార్లు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఏడాది మేలో కూతుర్ని పుట్టింటికి తీసుకువచ్చాడు తండ్రి.

తన గ్రామానికి సమీపంలో ఉన్న ఫారం హౌస్ వద్ద ఆమెను కొట్టి గొంతు పిసికి చంపేశాడు. అనంతరం గడ్డివాములో శవాన్ని పడేసి నిప్పు పెట్టి వెళ్లిపోయాడు. కొద్ది రోజులకు తన కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఓ ఆగంతకుడు.. పోలీసులకు ఫోన్ చేసి.. రవి కూతుర్ని తీసుకెళ్లిన విషయాన్ని చెప్పాడు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు.. రవిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేపట్టగా.. అసలు విషయం బయటపెట్టాడు. ఫోరెన్సిక్ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లి తనిఖీ చేయగా.. కొన్ని ఎముకలు మాత్రమే లభించాయి. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ హత్యలో మరెవ్వరి ప్రమేయమేమైనా ఉందా అని దర్యాప్తు చేపడుతున్నారు. ఇష్ట పడ్డ వ్యక్తిని కాదని కూతురికి మరొకరితో వివాహం చేసిన తండ్రి.. అతడితో కాపురం చేయడం లేదని హత్య చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet