iDreamPost
android-app
ios-app

12 ఏళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. భర్త బయటకు వెళ్లగానే ప్రియుడ్ని ఇంటికి పిలిచి..

  • Published Aug 12, 2024 | 11:44 AM Updated Updated Aug 12, 2024 | 11:44 AM

మహేష్, తేజస్విని భార్యా భర్తలు. వీరిది లవ్ మ్యారేజ్.. ఆమె కోసం అన్ని వదిలి వచ్చేశాడు. దూరంగా బతుకుతున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అందంగా సాగిపోతున్న వీరి కాపురంలో అలజడి..

మహేష్, తేజస్విని భార్యా భర్తలు. వీరిది లవ్ మ్యారేజ్.. ఆమె కోసం అన్ని వదిలి వచ్చేశాడు. దూరంగా బతుకుతున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అందంగా సాగిపోతున్న వీరి కాపురంలో అలజడి..

  • Published Aug 12, 2024 | 11:44 AMUpdated Aug 12, 2024 | 11:44 AM
12 ఏళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. భర్త బయటకు వెళ్లగానే ప్రియుడ్ని ఇంటికి పిలిచి..

కాలేజ్ డేస్ నుండి వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమించిన యువతి కోసం కన్నవాళ్లను, అయిన వాళ్లు, పుట్టిన ఊరిని వదులుకుని వచ్చేశాడు. లవర్‌ను పెళ్లి చేసుకుని మరో చోట కాపురం పెట్టాడు. తన చదువుకు తగిన ఉద్యోగం రాకపోవడంతో ఆటో నడుపుతున్నాడు. వీరి సంసారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతుంది. పెద్దలు కూడా పంతాలు వీడి కలిసి పోయారు. అంతా సవ్యంగా జరిగితే.. ఇలా వార్తల్లో నిలిచేవారు కాదు ఈ జంట. కానీ ప్రాణంగా ప్రేమించిన భార్య.. భర్తను మోసగించడం స్టార్ట్ చేసింది. పరాయి పురుషుడి మోజులో పడి కట్టుకున్న వాడి కళ్లుగప్పుతూ .. భర్త ఇంటి నుండి బయటకు వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు ప్రారంభించేది. కానీ భార్య వ్యవహారం భర్తకు తెలిసి నిలదీసే సరికి.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది.

ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హాసన్ జిల్లాలోని హోలెనరసీపూర్ ప్రాంతానికి చెందిన మహేష్, తేజస్వినీలు కాలేజీ రోజుల నుండి లవర్స్. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంట బెంగళూరులోని వైట్ ఫీల్డ్ సమీపంలోని హగడూర్‌లో స్థిరపడ్డారు. వీరి పెళ్లై 12 సంవత్సరాలు అవుతుంది. అయితే భర్త ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకు వస్తుండగా.. భార్య తేజస్విని ఫైనాన్స్ ఆఫీసులో పనిచేస్తుంది. ఆ సమయంలో గజేంద్ర అనే యువకుడితో పరిచయం అయ్యింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్తకు తెలియకుండా అతడిని ఇంటికి తీసుకు వచ్చి గడిపేది. అలాగే ఆమె కూడా ఉద్యోగం పేరుతో గంటలు గంటలు బయట గడిపేది. దీంతో భర్త మహేష్‌కు అనుమానం ఏర్పడింది.

గత శుక్రవారం నాగుల పంచమి రోజు గిరాకీ ఉంటుందని మహేష్ ఐదు గంటలకే లేచి డ్యూటీకి వెళ్లిపోయాడు. భర్త బయటకు వెళ్లడంతో గజేంద్రను ఇంటికి రప్పించుకుని రొమాన్స్ స్టార్ట్ చేసింది తేజస్విని. అంతలో ఇంటికి వచ్చాడు భర్త మహేష్. ఇద్దరూ అడ్డంగా దొరికిపోయాడు. భార్యపై కోపంతో మహేష్ దాడి చేస్తుండటంతో తేజస్విని, గజేంద్ర కలిసి ఛార్జింగ్‌ వైర్‌తో మహేశ్‌ గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. డబ్బులు అడిగాడని, తన వద్ద లేకపోవడంతో దాడి చేయడానికి ప్రయత్నిస్తే తోసేశానని కట్టుకథ అల్లింది భార్య. అయితే మెడపై ఉన్న వైర్ గుర్తులు ఆమెను పట్టించాయి. అనుమానం వ్యక్తం చేసిన మహేష్ తండ్రి కోడలిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. తమదైన స్టైల్లో విచారించే సరికి నిజం వెల్లగక్కింది తేజస్విని. తల్లి జైలులో ఉండటం, తండ్రి హత్యకు గురికావడంతో వీరి పిల్లలు అనాథలు అయ్యారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş