iDreamPost
android-app
ios-app

అమ్మాయిలు మీకు కూడా బాయ్ బెస్టీలు ఉన్నారా? ఈమె కథ తెలుసుకోండి!

అమ్మాయిలు బాయ్స్ బెస్టీలను గుడ్డిగా నమ్ముతున్నారా.. పెళ్లైన తర్వాత కూడా వారితో నిత్యం టచ్ లో ఉంటున్నారా..? ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటున్నారా..? అయితే అలాంటి వారికి అలర్ట్. ఇదిగో ఈ ఘటనే అందుకు ఉదాహరణ.

అమ్మాయిలు బాయ్స్ బెస్టీలను గుడ్డిగా నమ్ముతున్నారా.. పెళ్లైన తర్వాత కూడా వారితో నిత్యం టచ్ లో ఉంటున్నారా..? ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటున్నారా..? అయితే అలాంటి వారికి అలర్ట్. ఇదిగో ఈ ఘటనే అందుకు ఉదాహరణ.

అమ్మాయిలు మీకు కూడా బాయ్ బెస్టీలు ఉన్నారా? ఈమె కథ తెలుసుకోండి!

చిన్ననాటి స్నేహితులు కదా.. వాళ్ల గురించి బాగా తెలుసు అనుకుని భ్రమలో బతికేస్తున్నారు కొంత మంది అమ్మాయిలు. ముఖ్యంగా బాయ్ బెస్టీలతో ఫ్రెండిషిప్‌ను కొనసాగిస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా చైల్ట్ హుడ్ ఫ్రెండ్స్‌తో చనువుగా ఉంటున్నారు. వారితో ఎప్పుడూ టచ్‌లో ఉంటూ తమ ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఇదే వారి కొంపముంచుతుంది. తాజాగా హైదరాబాద్‌లో తనకు జాబ్ వచ్చిందని తన చిన్ననాటి స్నేహితురాలిని వనస్థలిపురం ఓంకార్ నగర్‌లోని బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్‌లో డిన్నర్‌కు పిలిచి మరో స్నేహితుడితో కలిసి అత్యాచారానికి ఒడిగట్టాడు యడ్ల గౌతమ్ రెడ్డి. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. అలాగే ఇప్పుడు ఇద్దరు బాయ్ బెస్టీల కారణంగా ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.

తనతో చిన్నప్పటి నుండి తన క్లాస్ మేట్స్ అయిన ఇద్దరి బాయ్ ఫ్రెండ్స్ వేధింపుల వల్ల ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన కర్ణాటకలోని బాగల్ గుంటె పోలీస్ స్టేషన్ పరిధిలోని సిడేహళ్లిలో చోటుచేసుకుంది. కాగా,మమతకు ఇటీవలే పెళ్లైంది. భర్త ఉద్యోగానికి వెళ్లిపోగానే అశోక్, గణేష్ అయిన తన చిన్ననాటి స్నేహితులతో ఎప్పుడూ టచ్‌లో ఉండేది. మమత, అశోక్, గణేష్‌లు చిన్నప్పటి నుండి పీయూసీ వరకు క్లాస్ మేట్స్. నిత్యం వారితోనే చాటింగ్, కాల్స్ మాట్లాడుతూ.. భర్తను పెద్దగా పట్టించుకోలేదు. ఈ విషయం భర్తకు తెలిసి..వారితో మాట్లాడటం తగ్గించుకోవాలని హితవు పలికాడు. అయినా వినిపించుకోలేదు మమత. అటు భర్త ఉద్యోగానికి వెళ్లడం ఆలస్యం.. వీరితో ముచ్చట్లలో మునిగి తేలిది. ప్రతి విషయాన్ని పంచుకునేది.

ఇదే అవకాశంగా భావించిన అశోక్,గణేష్‌లు ఆమెకు అసభ్యకరమైన సందేశాలు పంపించడం స్టార్ట్ చేశారు. తొలుత లైట్ తీసుకున్న మహిళ.. వేధింపులు ఎక్కువయ్యాయి. తమతో శారీరకంగా గడపాలంటూ డిమాండ్ చేశారు. ఒక్కసారిగా ఖంగుతిన్న మమత.. ఇద్దర్ని దూరం పెట్ట సాగింది. కానీ ఆమెను వదిలిపెట్టలేదు. వేర్వేరు నంబర్ల నుండి ఫోన్ చేసి, మేసేజ్ చేసి.. ఓ రాత్రి మాతో గడుపు అని, తమకు సహకరించకపోతే.. చాటింగ్స్ భర్తకు పంపి.. నీ బతుకు నాశనం చేస్తామంటూ బెదిరించారు. దీంతో భర్తకు చెప్పలేక, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది మమత. డ్యూటీ నుండి ఇంటికి వచ్చిన భర్త ఎన్నిసార్లు తలుపుకొట్టినా తీయకపోవడంతో మరో తాళం చెవితో డోర్ ఓపెన్ చేయగా.. ఉరి వేసుకుని కనిపించింది. ఆమె సూసైడ్ నోట్‌లో తన చావుకు అశోక్, గణేష్ కారణమంటూ పేర్కొంది. తనకు అసభ్యకర సందేశాలు పంపుతున్నారని రాసింది. సూసైట్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişjojobet girişjojobet girişcasibomcasibomjojobet