iDreamPost
android-app
ios-app

అందమైన బ్యూటీషియన్.. కానీ అలా చేసిందెందుకో

  • Published May 27, 2024 | 11:31 AM Updated Updated May 27, 2024 | 11:31 AM

ఆమె అందమైన బ్యూటీషియన్. ఆమె కూడా చాలా స్టైలిష్. స్థానిక మహిళలు ఆమె వద్దకు వచ్చి అందానికి మెరుగులు దిద్దుకుంటూ ఉంటారు. కానీ ఆమె మాత్రం ఊహించని పని చేసి..

ఆమె అందమైన బ్యూటీషియన్. ఆమె కూడా చాలా స్టైలిష్. స్థానిక మహిళలు ఆమె వద్దకు వచ్చి అందానికి మెరుగులు దిద్దుకుంటూ ఉంటారు. కానీ ఆమె మాత్రం ఊహించని పని చేసి..

  • Published May 27, 2024 | 11:31 AMUpdated May 27, 2024 | 11:31 AM
అందమైన బ్యూటీషియన్.. కానీ అలా చేసిందెందుకో

ఎంత సంపాదించినా.. అనారోగ్యం పాలైతే చాలు.. చెప్పుకోలేని బాధ వెంబడిస్తుంది. డబ్బులు ఖర్చుపెట్టినా.. తగ్గని రోగాలు శారీరకంగా, మానసికంగా హింసకు గురి చేస్తుంటాయి. ఇవే ఊహించలేని వేదనను మిగిలుస్తున్నాయి. కొంత మంది ఈ బాధను తట్టుకోలేక.. దేవుడు తన జీవితానికి త్వరగా విముక్తి కలిగిస్తే బాగుండు అని కోరుకుంటారు. మరికొంత మంది ఏకంగా బలవన్మరణానికి పాల్పడుతుంటారు. దానికి చనిపోవాలా అని చూసిన జనాలు చెవులు కొరుక్కుంటారు కానీ.. ఆ రోగం తాలుకా వేదన, పడుతున్న నరకం బాధితులే తెలుసు. కానీ ఆత్మహత్య పరిష్కారం కాదని ఓ వర్గం వాదన గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. తాజాగా ఓ మహిళ.. చిన్న కారణానికే ఆత్మహత్య చేసుకుంది.

కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడుతున్న ఓ బ్యూటీషియన్.. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా నయం కాకపోవడంతో చివరకు చావే గతి అని భావించింది. అనుకుదే తడువుగా అంత కన్నా భయంకరమైన నొప్పితో ఆత్మహత్య చేసుకుంది. ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది మహిళ. ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే భద్రావతికి చెందిన అక్షిత.. సొరభ పట్టణానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుని ఇదే నగరంలోని విద్యుత్ నగరలో నివాసం ఉంటోంది. అక్కడే బ్యూటీ పార్లర్ నడుపుతోంది. అయితే అక్షిత కొన్ని రోజుల నుండి విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుంది. ఎన్ని మందులు వాడినా ఉపయోగం లేదు. దీంతో వైద్యుల్ని సంప్రదించింది.

అయినప్పటికీ వైద్యం నయం కాకపోవడంతో.. ఇక కడుపునొప్పి బాధను తట్టుకోలేకపోయింది. తనను తాను సముదాయించుకున్న కూడా ఈ నొప్పి తగ్గడం లేదు. దీంతో ఆత్మహత్యే దీనికి శాశ్వత పరిష్కారం అని భావించిన అక్షిత.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చిన భర్త ఆమెను అలా చూసి.. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చనిపోయిందని వైద్యులు నిర్దారించారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఆమె కడుపునొప్పి తాళలేక బలవన్మరణానికి పాల్పడినట్లు నిర్దారించారు. అయితే స్థానికులు మాత్రం.. ఇంత చిన్నదానికే చనిపోతారా అంటూ చర్చించుకుంటున్నారు. మంచి బ్యూటీషియన్ ఇలా చేసిందేమిటీ అంటూ మాట్లాడుకుంటున్నారు.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş