iDreamPost
android-app
ios-app

అమ్మ ప్రేమ.. కూతురిని చంపేస్తాడని.. ఎదురుదాడి చేసి చంపేసింది!

  • Published Mar 05, 2024 | 12:21 PM Updated Updated Mar 05, 2024 | 12:21 PM

దూరపు బంధువు కదా అని.. క్యాజువల్ టాక్ అనుకుంది యువతి. కానీ ఇదే అదునుగా తీసుకుని ఆమెను ప్రేమ పేరుతో వేధించడం మొదలు పెట్టాడు యువకుడు. దీంతో ఆమె భయపడి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దూరపు బంధువు కదా అని.. క్యాజువల్ టాక్ అనుకుంది యువతి. కానీ ఇదే అదునుగా తీసుకుని ఆమెను ప్రేమ పేరుతో వేధించడం మొదలు పెట్టాడు యువకుడు. దీంతో ఆమె భయపడి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  • Published Mar 05, 2024 | 12:21 PMUpdated Mar 05, 2024 | 12:21 PM
అమ్మ ప్రేమ.. కూతురిని చంపేస్తాడని.. ఎదురుదాడి చేసి చంపేసింది!

ఆమె దూరపు బంధువు. అందంగా ఉండటంతో పరిచయం పెంచుకున్నాడు యువకుడు. ఫోన్లు నంబర్స్ మార్చుకున్నారు. ఇక అప్పటి నుండి ప్రేమ, పెళ్లి అంటూ యువతి వెంటపడ్డాడు. ఆరు నెలలు, ఏడాది కాదూ.. ఏకంగా మూడు సంవత్సరాల పాటు లవ్ చేయాలంటూ ప్రేయసి చుట్టూ తిరిగాడు. కానీ ఆమె కనికరించలేదు. మాటలతో వినడం లేదని బెదించాలని ప్రయత్నించాడు. ఫోనులో రెండు మూడు సార్లు బెదిరించడంతో భయపడ్డ యువతి..తల్లిదండ్రులకు జరిగినదంతా చెప్పింది. తెలిసిన వాడే కావడంతో పంచాయతీ పెట్టించారు. మాట వినకపోవడంతో పోలీసులను సంప్రదించారు. అయినా అతడి తీరు మారలేదు. చివరకు ఆమెను చంపేయాలన్న కసితో ప్రేయసి ఇంటికి వెళ్లి.. వారి చేతిలోనే హతమయ్యాడు.

ఈ ఘటన తెలంగాణ జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన బోగ మహేశ్‌కు.. తన దూరపు బంధువైన రాజేశం, సత్తవ్వ కుమార్తెతో పరిచయం ఏర్పడింది. కాగా, రాజేశం జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. సత్తవ్వ కూతురు, తండ్రి నర్సయ్యతో కలిసి తక్కళ్లపల్లిలో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో మహేశ్.. యువతితో పరిచయం పెంచుకుని.. ఆమె నంబర్ తీసుకుని.. ప్రేమించాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. అయితే అతడి వేధింపులు తాళలేక.. తల్లికి చెప్పింది. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. అనంతరం పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో.. అతడికి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు.

కొన్ని రోజుల పాటు ఆమెకు ఫోన్ చేయలేదు మహేశ్. అయితే అతడి తీరు మారలేదు.ఈ నెల 6న యువతి పుట్టిన రోజు వస్తుండటంతో.. ఆ రోజు డేత్ డేగా మారుస్తానంటూ వరుసగా పోస్టులు పెడుతున్నాడు. ఇవి చూసి భయపడ్డ యువతి.. తల్లికి చెప్పింది. ఆమె సాయంతో ఈ నెల 2న పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేసింది. దీంతో ప్రేయసిపై కక్ష పెంచుకున్న మహేశ్.. ఆమెను చంపేయాలన్న ఉద్దేశంతో అదే రోజు మధ్యాహ్నం తక్కళ్ల పల్లిలోని యువతి ఇంటికి చేరుకున్నాడు. తొలుత యువతి తల్లి కనపడగా.. ఆమెపై కత్తి దూశాడు. ఆమె తప్పించుకునే క్రమంలో కాలికి గాయమైంది. అనంతరం అక్కడే పడుకున్న యువతి తాతమైనా కత్తితో పొడవగా ఆయనకు గాయాలయ్యాయి.

కూతురిపై ప్రేమతో తల్లి అపరకాళిలా మారింది. కుటుంబ సభ్యుల సాయంతో అతడిని కింద పడేసింది. అంత టెన్షన్ లోనూ కూతురు ఏమైపోతుందో అన్న అలోచన  చేసింది సత్తవ్వ. వెంటనే ఆత్మ రక్షణలో భాగంగా బండరాయితో మహేశ్ పై యువతి తల్లి దాడి చేయగా.. తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.  పోలీసులకు సమాచారం అందించారు. యువతి ఇచ్చిన ఫిర్యాదుతో మహేశ్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నర్సయ్యను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetelitcasinofixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet