iDreamPost
android-app
ios-app

వద్దని వారించినా తల్లిదండ్రులు ఆ పని చేయడంతో.. యువతి దారుణం

  • Published Jul 13, 2024 | 1:38 PM Updated Updated Jul 13, 2024 | 1:40 PM

ఆడ పిల్లకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆరాటపడుతుంటారు. ఆమె కోసం నగలు, డబ్బులు సేవింగ్స్ చేస్తారు. కానీ మనస్సును అర్థం చేసుకోవడం లేదు. పెళ్లి విషయంలో మాత్రం ఆమె ఇష్టా ఇష్టాలకు ప్రాధాన్యతనివ్వడం లేదు. దీంతో..

ఆడ పిల్లకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆరాటపడుతుంటారు. ఆమె కోసం నగలు, డబ్బులు సేవింగ్స్ చేస్తారు. కానీ మనస్సును అర్థం చేసుకోవడం లేదు. పెళ్లి విషయంలో మాత్రం ఆమె ఇష్టా ఇష్టాలకు ప్రాధాన్యతనివ్వడం లేదు. దీంతో..

  • Published Jul 13, 2024 | 1:38 PMUpdated Jul 13, 2024 | 1:40 PM
వద్దని వారించినా తల్లిదండ్రులు ఆ పని చేయడంతో.. యువతి దారుణం

ఆడపిల్లని మహాలక్ష్మిగా భావిస్తుంటారు పేరెంట్స్. ఆమె కంటతడి పెడితే ఇంటికి కీడు జరుగుతుందని విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా మంగళ, శుక్రవారాల్లో ఆడపిల్ల ఏడిస్తే అపశకునం జరుగుతుందని బలంగా నమ్ముతుంటారు. అందుకే ఆమె అడిగిందల్లా కాదనకుండా ఇస్తారు. అలాగే బిడ్డను బాగా చదివించాలని, తన కాళ్ల మీద తాను నిలబడేలా చేయాలని ఆలోచిస్తున్నారు. అలాగే పెళ్లి కోసం నగలు, డబ్బులు దాచిపెడతారు. ఇవ్వన్నీ చేస్తున్నారు కానీ పెళ్లి విషయం దగ్గరకు వచ్చేసరికి కూతురి ఇష్టా ఇష్టాలకు విలువనివ్వడం లేదు. అప్పుడు ఏడ్చి గగ్గోలు పెట్టినా.. మనస్సు కరగదు.  పెళ్లి వద్దు అంటే.. ఆమె అభిప్రాయమేంటో.. మానసిక పరిస్థితి ఏంటో అడిగి తెలుసుకోవడం లేదు.

అలాగే కుమార్తె సైతం.. తన తల్లిదండ్రుల్ని ఆ సమయంలో విలన్లుగా భావించి.. తన మనస్సులో మాట చెప్పడం లేదు. చివరకు ఆడ పిల్ల దారుణమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదిగో రుచితలా. పెళ్లి చేసుకోవడానికి సంసిద్దంగా లేని సమయంలో కూతురు అభిప్రాయాలు తెలుసుకోకుండా పేరెంట్స్ సంబంధాలు చూస్తున్నారని ఆవేదనతో రుచిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..   కోరుట్లలోని అల్లమయ్య గుట్ట ప్రాంతానికి చెందిన జన్నారపు రవి- రాజకుమారి దంపతుల కుమార్తె  రుచిత (19)కు తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. ఇటీవల చూసిన సంబంధం విషయమై తల్లిదండ్రులు ఆమెతో మాట్లాడగా.. తొలుత తాను ఇప్పుడే చేసుకోనని చెప్పింది.

తిరిగి ప్రశ్నించగా.  ఏమీ సమాధానం చెప్పకుండా ముభావంగా ఉండిపోయింది. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక, ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేక.. మనో వేదనతో కుంగిపోతుంది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  పని మీద బయటకు వెళ్లి.. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కూతుర్ని ఆ పరిస్థితుల్లో చూసి కన్నీరుమున్నీరు అయ్యారు.  రుచిత చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.  పెళ్లి చేసి అత్తారింటికి పంపుదామని అనుకున్న సమయంలో ఇలా చూసి తట్టుకోలేకపోతున్నారు పేరెంట్స్. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomjojobetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş