iDreamPost
android-app
ios-app

భర్త స్నేహితులతో భార్య వివాహేతర సంబంధం.. ఈ క్రైం స్టోరీ విని పోలీసులే ..

  • Published Jan 04, 2024 | 5:43 PM Updated Updated Jan 04, 2024 | 5:53 PM

ఈ లోకంలో స్వచ్ఛమైన బంధంగా పరిగణిచబడుతోంది స్నేహం. ఆపదలో, సమస్యల్లో ఉన్నామంటే.. ఏ బంధువు రాడు.. రూపాయి కాదు కదా.. మాట సాయం కూడా చేయరు. కానీ స్నేహితుడు అలా కాదు.. తోచిన సాయం చేస్తూనే.. అండగానూ నిలుస్తాడు. కానీ నేటి కాలంలో..

ఈ లోకంలో స్వచ్ఛమైన బంధంగా పరిగణిచబడుతోంది స్నేహం. ఆపదలో, సమస్యల్లో ఉన్నామంటే.. ఏ బంధువు రాడు.. రూపాయి కాదు కదా.. మాట సాయం కూడా చేయరు. కానీ స్నేహితుడు అలా కాదు.. తోచిన సాయం చేస్తూనే.. అండగానూ నిలుస్తాడు. కానీ నేటి కాలంలో..

  • Published Jan 04, 2024 | 5:43 PMUpdated Jan 04, 2024 | 5:53 PM
భర్త స్నేహితులతో భార్య వివాహేతర సంబంధం.. ఈ క్రైం స్టోరీ విని పోలీసులే ..

ప్రపంచంలో విలువైన, స్వచ్ఛమైన బంధం ఉందంటే అది స్నేహమే. అందుకే ఓ సినీ కవి అన్నాడు ‘స్నేహానికి కన్నా మిన్న లోకాన లేదురా’. ఆనందంలో, దు:ఖంలో తోడు నిలుస్తాడు స్నేహితుడు. ఆపదలో, కష్టకాలంలో అండగా ఉంటాడు. ఏ బంధమైనా త్వరగా విడిపోతుందేమో కానీ.. ఫ్రెండ్ షిప్ అలా కాదు. స్నేహంలో అలకలు, గొడవలు, తగాదాలు ఉంటాయి. అయినప్పటికీ.. అవి కూడా కొన్ని రోజులే. కానీ ఫ్రెండ్‌కు ఆపద వచ్చిదంటే చాలు.. పాత గొడవలు ఉన్నా మర్చిపోయి తిరిగి కలిసిపోతుంటారు. కానీ కాలం మారినట్లుగా.. ఫ్రెండిషిప్‌లో కూడా మార్పులు సంతరించుకున్నాయి. స్నేహం ముసుగులో ఫ్రెండ్ కు వెన్నుపోట్లు పొడుస్తున్నారు కొంత మంది స్నేహితులు.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే రియల్ స్టోరీ.. సినిమాను మించిపోతుంది. ట్విస్టులు కూడా మామూలుగా లేవు. స్నేహితుల ముసుగులో ఇద్దరు అతడిని నయవంచన చేశారు. తనకు తెలియకుండా భార్యతో రొమాన్స్ చేశారు. తట్టుకోలేక.. అతడు ముగ్గుర్ని హతమార్చాడు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ క్రైమ్ కథలో.. పోలీసులు కూడా విస్తుపోయే సంఘటనలు వెలుగు చూశాయి. కొన్ని నెలల క్రితం జరిగిన హత్య కేసులో నిందితుడ్ని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌లోని తూర్పు చంపారన్‌లోని సుగౌలి జిల్లాలోని సుగావ్ దిహ్ ప్రాంతంలో నివసిస్తున్నారు భార్యా భర్తలు అఖిలేష్ కుమార్, స్మితాదేవి. స్మితా చాలా అందగత్తె. అఖిలేష్ కు ఇద్దరు స్నేహితులు ఉన్నారు వాళ్లే రితేష్, రిషబ్.

తరచూ వాళ్ల ఇంటికి వస్తూ పోతుండటంతో రితేష్, రిషబ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది అఖిలేష్ భార్య స్మిత. ఈ విషయం భర్తకు తెలియగా.. రితేష్‌‌ను హత్య చేసి చంపాడు. ఈ విషయం తెలిసిన భార్య.. మరో ప్రియుడు రిషబ్‌తో కలిసి నేపాల్ పారిపోయింది.. అక్కడ ఈ జంట కాపురం చేయడం స్టార్ చేసింది. వాళ్లు నేపాల్‌లోని చిత్వాన్‌లో నివాసముంటున్నారని తెలుసుకున్న భర్త.. అక్కడకు వెళ్లాడు. అదును చూసి వీరిద్దని కూడా హత్య చేసి మృతదేహాలను గోనే సంచిలో కుక్కాడు. నవంబర్‌లో నేపాల్ పోలీసులకు రెండు బస్తాల్లో రెండు మృతదేహాలను కనుగొన్నారు. వివరాల మేరకు రిషబ్ తండ్రికి సమాచారం అందింది. రిషబ్ తండ్రి రెండు మృతదేహాలను గుర్తించారు.  వారిద్దరూ రిషబ్, స్మితలుగా పేర్కొన్నాడు.

అంతలో రితేష్ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసులో స్మిత భర్త అఖిలేష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. విస్తుపోయే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. ఈ ముగ్గుర్ని తానే హత్య చేశానని చెప్పడంతో విస్తుపోయారు పోలీసులు. అతని భార్య స్మితా దేవి తన స్నేహితులతో అక్రమ సంబంధం పెట్టుకుందని, ఈ విషయం తెలిసి.. అక్టోబర్ 23న రితేష్‌ను హత్య చేసి, రిషబ్ మామగారి గ్రామమైన ఖాప్ గోపాల్‌పూర్ గ్రామంలోని సారెహ్‌లోని గోతిలో అతని మృతదేహాన్ని పూడ్చిపెట్టానని చెప్పాడు.. దీని తర్వాత రిషబ్, స్మిత ఇద్దరూ నేపాల్‌కు పారిపోయారని, వారిని వెంటాడి చంపినట్లు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ క్రైం స్టోరీ వింటే  ఏం అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet