iDreamPost
android-app
ios-app

భర్త స్నేహితుడితో భార్య.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో..

  • Published May 06, 2024 | 1:28 PM Updated Updated May 06, 2024 | 1:28 PM

వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి కాపురం హాయిగా సాగిపోతుంది. కానీ అంతలో భార్యలో మార్పు. ఆమెలో ఆమె మురిసిపోతూ.. నవ్వుకుంటూ.. ఫోనులో మాట్లాడుతుండటంతో భర్తకు అనుమానం కలిగింది. చివరకు

వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి కాపురం హాయిగా సాగిపోతుంది. కానీ అంతలో భార్యలో మార్పు. ఆమెలో ఆమె మురిసిపోతూ.. నవ్వుకుంటూ.. ఫోనులో మాట్లాడుతుండటంతో భర్తకు అనుమానం కలిగింది. చివరకు

  • Published May 06, 2024 | 1:28 PMUpdated May 06, 2024 | 1:28 PM
భర్త స్నేహితుడితో భార్య.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో..

అనుమానం పెను భూతం అన్నారు పెద్దలు. కానీ అదే నిజమైతే కాపురం రెండు ముక్కులు అవుతుంది. భర్త మరో మహిళతో సాన్నిహిత్యంగా మాట్లాడిన భార్య సహించలేదు. అలాగే భార్య కాస్త నవ్వుతూ ఏ వ్యక్తినైనా పలకరిస్తే భరించలేడు భర్త. జీవిత భాగస్వామి తనను కాకుండా మరొకరితో వివాహేతర సంబంధం/అక్రమ సంబంధం నెరుపుతుందన్న/పెట్టుకున్నాడన్న అనుమానం వస్తే చాలు.. మానసిక వేదనే మిగులుతుంది. ఇప్పుడు చాలా మంది కాపురాల్లో చిచ్చుకు కారణమౌతున్నాయి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్. ఈ చీకటి కాపురం గురించి తెలిస్తే.. భార్యా భర్తల్లో ఒక్కరే మిగులుతున్నారు. ఇలాంటి విషయాలు.. ఎంతో మంది జీవితాలను బలితీసుకున్నాయి. తాజాగా ఇటువంటి ఘటనే బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

భర్త స్నేహితుడితోనే ప్రేమాయణం స్టార్ట్ చేసింది ఇల్లాలు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త భార్యను అంతమొందించాడు. బీహార్‌లోని బంకా జిల్లాలోని శంభుగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామ్‌చువా పంచాయతీలోని బాడి ఖజురి గ్రామంలో మున్నా రామ్, అంజలీ దేవీ భార్యా భర్తలు జీవిస్తున్నారు. వీరిద్దరిదీ లవ్ మ్యారేజ్. పదేళ్ల క్రితం ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. హాయిగా సాగిపోతుంది కాపురం.. కాగా, మున్నారామ్ హైదారాబాద్‌లో కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ సమయంలో భార్య అంజలి వక్రమార్గంలో నడిచింది. ఏకంగా భర్త స్నేహితుడితో చనువుగా ఉండటం స్టార్ట్ చేసింది. ఇద్దరు ఫోన్ నంబర్స్ మార్చుకుని.. గంటలు గంటలు మాట్లాడుకుంటున్నారు. భర్తకు తెలియకుండా చాటుమాటుగా ఇద్దరు కలుసుకునేవారు. యితే భర్త మున్నాకు భార్య అంజలీపై అనుమానం ఏర్పడింది.

అ ఈ క్రమంలో తమ స్వంతూరు వెళ్లిపోయారు. ఓ రోజు భార్య ఫోనులో మాట్లాడటం గమనించాడు. చాటుగా ఆమె ఏం మాట్లాడుతుందో విన్నాడు. భర్త.. ప్రియుడితో భార్య రొమాంటిక్‌గా ఫోనులో మాట్లాడం విని తట్టుకోలేకపోయాడు.  వెంటనే భార్య ముందుకు వెళ్లాడు. భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో విస్తుపోయింది భార్య. తన అనుమానం నిజమైందన్న ఆవేదనలో కోపంతో భార్యను చితకబాదాడు. చివరకు తీవ్ర గాయాలైన భార్యను తీసుకుని శంభుగంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. ఆసుపత్రి నుండి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. భర్త మున్నారామ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  భర్త స్నేహితుడితోనే అక్రమ సంబంధం పెట్టుకుని.. చివరకు కట్టుకున్న వాడి చేతిలో బలైంది. ఇటీవల కాలంలో ఈ వివాహేతర సంబంధాల వల్లే ఎక్కువగా హత్యలు చోటుచేసుకుంటున్నాయి. రాను రానూ వీటి శాతం పెరుగుతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet