iDreamPost
android-app
ios-app

రియల్ బేబి.. ప్రేమ పేరుతో ఐదేళ్లు తిరిగి..

  • Published Sep 11, 2023 | 6:56 PM Updated Updated Sep 11, 2023 | 6:56 PM
  • Published Sep 11, 2023 | 6:56 PMUpdated Sep 11, 2023 | 6:56 PM
రియల్ బేబి.. ప్రేమ పేరుతో ఐదేళ్లు తిరిగి..

‘బేబి’ మూవీ ఎంతటి సంచలనం విజయం సాధించిందో అందరికీ తెలుసు. కారణం.. ప్రేమించిన యువతి చేతిలో మోసపోయిన అబ్బాయిలు.. ఆ సినిమా హీరోల ప్లేసుల్లో తమను తాము చూసుకోవడమే. ప్రతి అబ్బాయికి ఎక్కడో ఓ సందర్భం కనెక్ట్ కావడంతో సినిమాపై కనక వర్షం కురిపించారు. ఇప్పటి వరకు అబ్బాయిలు మంచి వాళ్లు కాదని, అమ్మాయిలకు మాయమాటలు చెప్పి, ముగ్గులో దింపి, అవసరాలు తీర్చుకున్నాక వదిలి పెట్టి వెళ్లిపోతారన్న అపవాదును మోస్తున్నారు. అయితే ఇప్పుడు ఆడపిల్లలు ఏం తీసిపోవడం లేదు. మోసగించడంలో మగజాతి సైతం ఆశ్చర్యపోయేలా వీరి చర్యలు ఉంటున్నాయి. ప్రేమ అని చెప్పకుండా క్లోజ్‌గా మూవ్ కావడం, అతడితో అన్ని కొనిపించుకోవడం, ఆ తర్వాత మంచి సంబంధాలు వస్తే ప్రియుడ్ని వదిలి మరొకరితో పెళ్లి పీటలు ఎక్కడం పరిపాటిగా మారిపోతుంది. లేదంటే గొడవ పెట్టుకుని, బ్రేకప్ చెప్పేసి.. మరొక బకరాకు వలవేస్తున్నారు. ప్రియురాలి మోసాన్ని కొంత మంది భరించగలుగుతుంటే.. మరికొంత జీర్ణించుకోలేకపోతున్నారు.

ఏన్నో ఏళ్లుగా ప్రేమించిన ప్రేయసి.. తనను కాదన్న బాధతో ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడు తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని మిగిల్చాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు మండలం పోలారానికి చెందిన ఓ యువకుడు.. మహబూబాబాద్‌కు చెందిన దగ్గర బంధువుల అమ్మాయి ప్రేమించుకుంటున్నారు. ఐదు సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ బంధువులు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు. అయితే ఏమోందో తెలియని, తన కుమారుడిపై యువతి, ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని, దీంతో మహబూబాబాద్ పోలీసులు.. అతడ్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారని తల్లి పేర్కొంది. కొన్ని గంటల పాటు పోలీస్ స్టేషన్‌లో ఉంచి, తన కుమారుడ్ని చిత్ర హింసలకు గురి చేసి, కొట్టారని చెప్పారు. తమకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. మరుసటి రోజు దెబ్బలతో ఇంటికి వచ్చాడని, అడిగితే పోలీసులు కొట్టారని చెప్పాడన్నారు. 15 రోజులు మనిషి కాలేకపోయాడని, ఆ తర్వాత డాబా మీదకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. తన చావుకు ప్రేయసి, ఆమె తండ్రి, పోలీసు కారణమని సూసైడ్ నోటులో పేర్కొన్నాడు. తనకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş