iDreamPost
android-app
ios-app

పక్కింట్లో అబ్బాయి లవ్.. బ్రేకప్.. మరొకరితో

పక్కింట్లో అబ్బాయితో చనువు, స్నేహం పెరిగింది. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అంతలో ఈ ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. అతడ్ని మర్చిపోవాలంటూ కూతురికి నచ్చ చెప్పారు

పక్కింట్లో అబ్బాయితో చనువు, స్నేహం పెరిగింది. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అంతలో ఈ ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. అతడ్ని మర్చిపోవాలంటూ కూతురికి నచ్చ చెప్పారు

పక్కింట్లో అబ్బాయి లవ్.. బ్రేకప్.. మరొకరితో

ప్రతి లవ్ స్టోరీ పెళ్లి పీటలు ఎక్కుతుందని కచ్చితంగా చెప్పలేం. అబ్బాయి, అమ్మాయి గురించి పూర్తిగా తెలియకుండానే ఒకరికొకరు ప్రేమలో పడుతుంటారు. వారితో కొంత జర్నీ చేస్తుండగా.. అప్పుడు ఎక్కడో సెట్ కావడం లేదని బ్రేకప్ చెప్పుకుని విడిపోతారు. అయితే కొంత మంది మూవ్ అన్ అయిపోయి..తమ జీవితంలో బిజీగా మారిపోతారు. కొంత మంది మాత్రం లవర్‌కు ప్రతిరోజు హింసకు గురి చేస్తుంటారు. ముఖ్యంగా అబ్బాయిలు.. తనను కాదని.. మరొకర్ని అమ్మాయి ప్రేమించినా, పెళ్లి చేసుకుంటుందని తెలిసినా.. సహించలేరు.. భరించలేరు. తనకు దక్కదనిది.. మరెవ్వరికీ దక్కకూడదన్న ఉద్దేశంతో దుర్మార్గానికి దిగుతుంటారు.

తనను ప్రేమించి, మరొకరితో పెళ్లికి సిద్ధమైన ప్రేయసిని బెదిరించడంతో ప్రియురాలు తీవ్ర నిర్ణయం తీసుకుంది. అతడి టార్చర్ తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బెంగళూరు శివారులోని జిగాని పోలీస్ స్టేషన్ పరిధిలోని నంజాపూర్ సమీపంలో నివసిస్తోంది చంద్ర కళ కుటుంబం. ఆమె పక్కింట్లోనే నివసిస్తున్నాడు అరుణ్ కుమార్ అనే యువకుడు.  అతడితో చనువు, స్నేహానికి దారి తీసింది. అలా వారి మధ్య ప్రేమ చిగురించింది.  ఈ విషయం చంద్ర కళ అమ్మానాన్నలకు తెలిసింది. అతడు మంచి వాడు కాదని, నీకు సరిజోడు కాదంటూ చంద్రకళకు నచ్చచెప్పారు తల్లిదండ్రులు.  పలుమార్లు అతడి గురించి బ్యాడ్ గా చెప్పడంతో అతడి ప్రేమకు గుడ్ బై చెప్పింది.

వెంటనే చంద్రకళకు  మంచి సంబంధం తీసుకువచ్చారు తల్లిదండ్రులు.  ఆమెకు నిశ్చితార్థం జరిపించారు.  ఈ విషయం ప్రియుడికి తెలిసింది. తనకు బ్రేకప్ చెప్పి.. మరొకరితో వివాహానికి సిద్ధమవ్వుతుండంతో సహించలేకపోయాడు అరుణ్.  తనను కాదని మరొకర్ని పెళ్లి చేసుకుంటే..చంపేస్తానంటూ ప్రేయసిని బెదిరించాడు. దీంతో ఏం చేయాలో తోచక.. తన బాధను ఎవ్వరికీ చెప్పుకోలేక చంద్ర కళ ఆత్మహత్య చేసుకుని మరణించింది. కాగా తమ కూతురి మృతికి ప్రియుడు అరుణ్ కారణమంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి.. అరుణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet