iDreamPost
android-app
ios-app

తిరుపతి హాస్టల్లో ఉండాల్సిన యువతి.. ఒంగోలు ఆస్పత్రిలో శవమై! పైగా ప్రెగ్నెంట్ కూడా!

  • Published Aug 10, 2024 | 6:05 PM Updated Updated Aug 10, 2024 | 6:05 PM

ఆమె చిన్నప్పటి నుండే చదువులో బాగా చురుకు. టెన్త్, ఇంటర్ లో మంచి మార్కులు సాధించి.. ఎంసెట్ ర్యాంక్ కొట్టింది. దీంతో యూనివర్శిటీలో సీటు సంపాదించింది. కానీ హాస్టల్లో ఉండాల్సిన యువతి...

ఆమె చిన్నప్పటి నుండే చదువులో బాగా చురుకు. టెన్త్, ఇంటర్ లో మంచి మార్కులు సాధించి.. ఎంసెట్ ర్యాంక్ కొట్టింది. దీంతో యూనివర్శిటీలో సీటు సంపాదించింది. కానీ హాస్టల్లో ఉండాల్సిన యువతి...

  • Published Aug 10, 2024 | 6:05 PMUpdated Aug 10, 2024 | 6:05 PM
తిరుపతి హాస్టల్లో ఉండాల్సిన యువతి.. ఒంగోలు ఆస్పత్రిలో శవమై! పైగా ప్రెగ్నెంట్ కూడా!

ఆమె చదువుల తల్లి సరస్వతి. బాగా చదువుకుని యూనివర్శిటీలో సీటు సంపాదించింది. పెద్ద పెద్ద చదువులు చదివి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తెస్తుందని అనుకున్నారంతా.. కానీ అనూహ్యరీతిలో ఆమె మరణవార్త ఇంటికి చేరింది. కానీ హాస్టల్లో ఉండాల్సిన యువతి.. సొంత జిల్లాలోని ఓ ఆసుపత్రిలో శవమై తేలడంతో ఏం జరిగిందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు పేరెంట్స్. తిరుపతి యూనివర్శిటీ హాస్టల్లో ఉండాల్సిన చప్పిడి ప్రియ.. ఒంగోలు ఆసుపత్రిలో నోటి వెంట నురగలు కక్కుతూ చనిపోయింది. అయితే ప్రియ ఆరు నెలల గర్భవతి అని వైద్యులు నిర్ధారించడంతో ఆమె మృతిపై అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. ఐదుగురు యువకులు ఆమెను ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన చప్పిడి ప్రియ చీమకుర్తిలోని ఉర్డూ పాఠశాలలో టెన్త్‌ , ఇంటర్‌ చదివింది. మంచి మార్కులతో పాసైంది. చదువుల్లో రాణిస్తూ..ఎంసెట్ లో మంచి మార్కులు సాధించి ఎస్వీ యూనివర్శిటీలో బీటెక్‌లో చేరింది. అయితే రెండు రోజుల క్రితం తల్లిదండ్రులకు తన కడుపులో నొప్పిగా ఉందని చెప్పింది. అయితే హాస్టల్ ఫుడ్ వల్ల అనుకున్నారు. అంతలో.. ప్రియకు అనారోగ్యం బాగోలేదని, తిరుపతి నుండి రైల్లో వస్తుండగా పడిపోయిందని, ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చేర్చినట్లు తండ్రి రాజుకు ఎవరో ఫోన్ చేసి చెప్పారు. హుటా హుటిన ఆసుపత్రికి పరుగెత్తుకు వెళ్లి చూడగా.. ప్రియ నోటి వెంట నురుగుతో చనిపోయి కనిపించింది. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ఉండాల్సిన ప్రియ.. అక్కడకు ఎలా వచ్చిందని అనుమానం వ్యక్తం చేస్తుననారు.

హాస్టల్లో ఉందనుకున్న అమ్మాయి.. ఆస్పత్రిలో శవమై తేలడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఐదుగురు అబ్బయిలు యువతిని ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. కాగా, ప్రియ ఆరు నెలల గర్భవతి అని వైద్యులు తల్లిదండ్రులకు చెప్పడంతో విస్తుపోవడం వారి వంతైంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రియకు గర్భవతి చేసిన యువకుడు అబార్షన్ చేసేందుకు మందులు వాడటంతో అవి వికటించాయని భావిస్తున్నారు పోలీసులు. ప్రియకు చెందిన సెల్‌ఫోన్‌, డబ్బులు, దుస్తులు మాయం అయ్యాయని తెలుస్తుంది. అలాగే ఆమె ఆసుపత్రిలో చేరే నాటికే నైటీలో ఉండటం చూస్తుంటే.. ఇదంతా ఆమెను ఒంగోలులో ఉంచే ఈ దారుణానికి పాల్పడ్డారని చెబుతున్నారు. కాగా, ఆమె మరణం ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ ఘటనపై విచారణ చేసి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio