iDreamPost
android-app
ios-app

దారుణం: భార్యపై అనుమానం.. భర్త చేసిన పనికి షాకైన పోలీసులు!

  • Published Nov 18, 2023 | 11:11 AM Updated Updated Nov 18, 2023 | 11:11 AM

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యపై అనుమానంతో ఊహించిన పనికి తెర లేపాడు. దీనికి గ్రామ పెద్దలు కూడా సహకరించాడు. ఇక అసలు విషయం పోలీసులకు తెలియడంతో షాక్ గురయ్యారు. అసలేం జరిగిందంటే?

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యపై అనుమానంతో ఊహించిన పనికి తెర లేపాడు. దీనికి గ్రామ పెద్దలు కూడా సహకరించాడు. ఇక అసలు విషయం పోలీసులకు తెలియడంతో షాక్ గురయ్యారు. అసలేం జరిగిందంటే?

  • Published Nov 18, 2023 | 11:11 AMUpdated Nov 18, 2023 | 11:11 AM
దారుణం: భార్యపై అనుమానం.. భర్త చేసిన పనికి షాకైన పోలీసులు!

ఈ మధ్యకాలంలో కొందరు దంపతులు కట్టుకున్నవాళ్లను కాదని పరాయి వాళ్లతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. అలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ చివరికి సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. ఇక మరికొందరు భర్తలు మాత్రం.. భార్యలపై అనుమానపడుతూ వారిపై దారుణాలకు పాల్పడుతున్నారు. అవసరమైతే వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు గతంలో చాలా చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఏపీలో ఓ వ్యక్తి తన భార్యపై అనుమానంతో ఎవరూ ఊహించని పని చేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు భర్త ఏం చేశాడు? అసలు ఈ ఘటనలో ఏం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీని చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని తేనెపల్లి గ్రామం. ఇక్కడే ఎస్టీ కాలనీలో గుండయ్య-గంగమ్మ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారుల సంతానం. భార్యాభర్తలు చెరో చోట పని చేస్తూ సంసారాన్ని కొనసాగిస్తున్నారు. అలా చాలా కాలం పాటు ఈ భార్యాభర్తలు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే.. గత కొంత కాలం నుంచి గుండయ్య తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. నా భార్య పరాయి మగాడితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుందని అనుకున్నాడు. చాలా రోజుల నుంచి ఈ విషయాన్ని భార్యను అడగలేక వస్తూ వచ్చాడు.

కానీ, ఇటీవల అతని అనుమానం మరింత పెరిగిపోవడంతో తట్టుకోలేకపోయాడు. ఇక ఎట్టకేలకు భార్య గంగమ్మను నిలదీశాడు. అలాంటిది ఏం లేదని ఆ మహిళ ఎంత చెప్పినా అతడు వినకుండా గ్రామ పెద్దలతో పంచాయితీ పెట్టించాడు. ఇంతటితో ఆగని ఈ దుర్మార్గుడు మరో దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే? నా భార్యపై నాకు నమ్మకం ఏ మాత్రం లేదని, ఖచ్చితంగా శీల పరీక్ష పెట్టాలని గ్రామ పెద్దలతో చెప్పి పట్టు బడ్డాడు. ఇందులో భాగంగానే.. వీరి కులంలో ప్రాతివత్యాన్ని నిరూపించుకోవడానికి ఆనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం.. మహిళలు సలసల మరుగుతున్న వేడి నూనెలో చేతులు పెట్టాల్సి ఉంటుంది. ఆ మహిళ మాత్రం నేనెలాంటి తప్పు చేయలేదని, గ్రామ పెద్దలకు వివరించి చెప్పింది. కానీ, ఎవరూ వినలేదు. దీంతో భర్త ఓ కడాయి తీసుకొచ్చి గ్రామ పెద్దల ముందే అందులో నూనె పోసి వేడి చేశారు.

ఇక ఆ మహిళ తన ప్రాతివత్యాన్ని నిరూపించుకోవడానికి సిద్దమైంది. ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్న అక్కడి స్థానిక ఎంపీడీవో అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనుమానంతో భర్త భార్యపై దారుణానికి పాల్పడిన విషయం తెలుసుకుని వాళ్లు షాక్ కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని స్టేషన్ కు తీసుకెళ్లి.. ఇలాంటి పనికి మాలిన ఆచారాలతో మనుషుల ప్రాణాలు తీయకూడదని కౌన్స్ లింగ్ ఇచ్చి తిరిగి పంపించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. భార్యపై అనుమానంతో ఆమెను వేడి నూనెలో చేతులు పెట్టాలని పట్టుబడిన భర్త దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet