iDreamPost
android-app
ios-app

ప్రియుడే సర్వస్వం అనుకుంది.. కానీ, చివరికి అతడే..!

  • Published Oct 22, 2023 | 3:17 PM Updated Updated Oct 22, 2023 | 3:17 PM

ప్రియుడే సర్వస్వం అనుకుంది. ఇక చివరికి ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంది. కానీ, అతడే ఇలా చేయడంతో కావ్య తట్టుకోలేకపోయింది. అసలేం జరిగిందంటే?

ప్రియుడే సర్వస్వం అనుకుంది. ఇక చివరికి ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంది. కానీ, అతడే ఇలా చేయడంతో కావ్య తట్టుకోలేకపోయింది. అసలేం జరిగిందంటే?

  • Published Oct 22, 2023 | 3:17 PMUpdated Oct 22, 2023 | 3:17 PM
ప్రియుడే సర్వస్వం అనుకుంది.. కానీ, చివరికి అతడే..!

ఈ రోజుల్లో యువతి, యువకులు తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లిళ్ల కన్నా.. ప్రేమించిన వాళ్లని వారినే వివాహం చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే అచ్చం ఇలాగే ఈ యువతి కూడా ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఇదే విషయాన్ని ప్రియుడికి కూడా వివరించింది. కానీ, ప్రియుడు ఇచ్చిన ట్విస్ట్ కు ఆ యువతి తట్టుకోలేకపోయింది. దీంతో ఆ యువతి సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లాలోని వెంకటగిరి పట్టణంలో భారతి అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు ఓ కుమారుడితో పాటు కావ్య (25) అనే కూతురు కూడా ఉంది. బీటెక్ పూర్తి చేసిన ఈ యువతి గతంలో ఓ కంపెనీలో ఉద్యోగం చేసింది. ఈ క్రమంలోనే పెళ్లికూరు ప్రాంతానికి చెందిన తేజ అనే యువకుడు పరిచయం అయ్యాడు. అలా వీరి పరిచయం చివరికి ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు చాలా కాలం పాటు ప్రేమించుకున్నారు. తేజ పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించడంతో కావ్య అతనికి అన్ని రకాలు దగ్గరైంది. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజుల నుంచి కావ్య ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని కోరింది. దీనికి తేజ మాత్రం.. చేసుకోనని చెప్పినట్లుగా తెలుస్తుంది. ప్రియుడే సర్వస్వం అనుకుంటే.. చివరికి అతడే కాదనడంతో కావ్య తట్టుకోలేకపోయింది.
ఇక శుక్రవారం రాత్రి కూడా కావ్య ప్రియుడికి ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని బతిమాలింది. కానీ, తేజ మాత్రం దానికి అంగీకరించలేదు. దీంతో ఆ యువతికి ఏం చేయాలో తెలియక మరుసటి రోజు ఇంటిపై చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉన్నట్టుండి కావ్య కనిపించకపోవడంతో తల్లి భారతి అంతటా వెతికింది. ఈ క్రమంలోనే ఇంటిపై చూడగా.. కూతురు ఉరికి వేలాడుతూ కనిపించింది. ఈ సీన్ చూసిన తల్లి ఒక్కసారిగా షాక్ గురై గుండెలు పగిలేలా ఏడ్చింది. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని ఆత్మహత్యకు పాల్పడ్డ కావ్య నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibom