iDreamPost
android-app
ios-app

ఇద్దరిదీ చిన్న వయసు.. ప్రేమ కోసమని..

  • Published Dec 15, 2023 | 12:36 PM Updated Updated Dec 15, 2023 | 12:36 PM

ఆమె వయసు 15 సంవత్సరాలు.. అతడి వయసు 18 సంవత్సరాలు.. ఇద్దరూ మైనర్లు.. వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ ఉన్నారు..

ఆమె వయసు 15 సంవత్సరాలు.. అతడి వయసు 18 సంవత్సరాలు.. ఇద్దరూ మైనర్లు.. వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ ఉన్నారు..

  • Published Dec 15, 2023 | 12:36 PMUpdated Dec 15, 2023 | 12:36 PM
ఇద్దరిదీ చిన్న వయసు.. ప్రేమ కోసమని..

కొన్ని విషయాల్లో ప్రేమ-చావు రెండూ ఒక్కటే. చావు ఎప్పుడు వస్తుందో చెప్పలేము. ప్రేమ ఎప్పుడు.. ఎవరి మీద పుడుతుందో కూడా చెప్పలేము. అలాగే చావులో కూడా తోడు వచ్చేదే నిజమైన ప్రేమ. అంటే మనం ప్రేమించిన వాళ్లు చనిపోతే.. వాళ్లతో పాటు మనం కూడా చనిపోవాలని కాదు.. ఎదుటి వ్యక్తి కోసం చచ్చేంత ప్రేమ ఉండాలి అనేది ఇక్కడ ఉద్దేశ్యం. కొంతమందికి ఇది అమాయకత్వంగా అనిపించినా.. కలిసి బతకలేని చోట చావే ప్రేమకులకు మూడు ముళ్లు , ఏడు అడుగులు వేసే గమ్యంగా కనిపిస్తూ ఉంటుంది.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో మైనర్లు ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, ఏమైందో ఏమో తెలియదు. పెద్దలకు ప్రేమ విషయం చెప్పకుండానే ప్రాణాలు తీసుకున్నారు. ఈ సంఘటన కర్ణాటకలోని కలబురగి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని కలబురగి జిల్లా, చిత్తాపుర తాలూకాలోని రాంపురహళ్లి గ్రామానికి చెందిన 15 ఏళ్ల రాధిక మత్తన్‌ అక్కడి ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది.

తరకస్‌పేట గ్రామానికి 18 ఏళ్ల ఆకాశ్‌ యాదగిరిలోని ఐటీఐ కాలేజీలో చదువుతున్నాడు. వీరిద్దరివీ పక్క పక్క గ్రామాలు కావటంతో ఎలాగో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గత కొన్నేళ్ల నుంచీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. తరచుగా ఇద్దరూ కలుసుకునే వారు. ఫోన్లలో గంటల గంటలు మాట్లాడుకునే వారు. అయితే, ఈ విషయం రెండు కుటుంబాల్లోని పెద్దలకు తెలీదు. ఇద్దరూ మైనర్లు కావటంతో ప్రేమ గురించి, పెళ్లి గురించి ఇంట్లో చెప్పలేకపోయారు.

దీనికి తోడు వీరిద్దరి కులాలు వేరు కావటంతో .. ఇంట్లో విషయం చెప్పినా పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని భావించారు. ఈ నేపథ్యంలోనే దారుణమైన నిర్ణయానికి వచ్చారు. కలిసి బతకలేనపుడు.. చావుతో ఒక్కటవుదామని భావించారు. మంగళవారం అనుకున్నట్లుగానే ఇద్దరూ ఇళ్లనుంచి బయటకు వచ్చేశారు. కూళ్లర గ్రామ సమీపంలోని ఓ నిర్మానుష ప్రదేశంలోకి వెళ్లారు. వెంట తెచ్చుకున్న విషం తాగారు. ఇద్దరూ చావు బ్రతుకుల మధ్య పోరాడసాగారు.

వీరిని గమనించిన గ్రామస్తులు వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, మార్గం మధ్యలోనే ఇద్దరూ కన్నుమూశారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రేమికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మరి, ప్రేమ వ్యవహారం కారణంగా ఇ‍ద్దరు మైనర్లు ప్రాణాలు తీసుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş