Chennai Crime News: వీడియో: నడిరోడ్డుపై గంజాయి బ్యాచ్ హల్ చల్.. ఏకంగా పోలీసునే తరిమికొట్టారు!

వీడియో: నడిరోడ్డుపై గంజాయి బ్యాచ్ హల్ చల్.. ఏకంగా పోలీసునే తరిమికొట్టారు!

నేటి కాలం యువత ఎక్కువగా మద్యానికి బానిసవుతున్నారు. మరీ ముఖ్యంగా గంజాయికి అలవాటు పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా గంజాయి మత్తులో ఊగిపోతూ చివరికి ఎటు కాకుండా పోతున్నారు. ఇక అదే మత్తులో ఎన్నో దారుణాలకు కూడా పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఓ గంజాయి బ్యాచ్ ఇటీవల హల్ చల్ చల్ చేసింది. నడి రోడ్డుపై ఏకంగా ఓ పోలీస్ ఆఫీసర్ నే తరిమి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం చెన్నైలోని కట్టుపాక్కంలో తిరుమావళవన్ అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ గంజాయి బ్యాచ్ తిరుమావళవన్ ను అడ్డగించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఓ పోలీస్ ఆఫీసర్ ఆ గంజాయి ముఠా నుంచి తిరుమావళవన్ రక్షించాడు. ఆ తర్వాత ఆ గంజాయి బ్యాచ్ ఆ పోలీస్ ఆఫీసర్ పై తిరగబడి దాడికి చేసేందుకు ప్రయత్నించారు.

మత్తులో ఉన్న ఆ వ్యక్తుల దాడి నుంచి ప్రాణాన్ని కాపాడుకునేందుకు ఆ పోలీస్ ఆఫీసర్ రోడ్డుపై పరుగులు తీశాడు. ఇదంతా గమనించిన కొందరు స్థానికులు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. అనంతరం పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: బిర్యానీ కోసం ఫైటింగ్.. యువకుడిని కత్తులతో నరికి చంపిన దండగులు!

Show comments