పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ లక్నోలోని ఇందిరానగర్ బీజేపీ ఎమ్మెల్యే సీతారాం కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. అయితే, బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిన ఎమ్మెల్యే సీతారాం భార్య పుష్ప వర్మ తిరిగి ఇంటికి రాలేదు.

బీజేపీ ఎమ్మెల్యే భార్య అదృశ్యం అయిన ఘటన లక్నాలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. ఇదే విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా విడిపోయి ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఏకంగా ఓ ఎమ్మెల్యే భార్య కనిపించకపోవడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇదే ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ లక్నోలోని ఇందిరానగర్ బీజేపీ ఎమ్మెల్యే సీతారాం కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. అయితే, బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిన ఎమ్మెల్యే సీతారాం భార్య పుష్ప వర్మ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె భర్త, కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. చాలా సమయం అయినా కనిపించకపోవడంతో ఆమె భర్త ఇందిరానగర్ పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా విడిపోయి ఆమె ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. అదృశ్యం అయిన బీజేపీ ఎమ్మెల్యే సీతారాం భార్య ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.