iDreamPost
android-app
ios-app

ఛత్తీస్‌గఢ్‌లో:భార్యపై అనుమానంతో భర్త దారుణం.. అర్ధరాత్రి నిద్రలోనే!

  • Published Jan 02, 2024 | 5:04 PM Updated Updated Jan 02, 2024 | 5:04 PM

వైవాహిక జీవితంలో వివాహేతర సంబంధలు చిచ్చుపెడుతున్నాయి. పచ్చని కాపురాలు కూడా ఈ అక్రమసంబంధం వల్ల నిలువున కూలిపోతున్నాయి. ఏకాంగా భార్యభర్తలు ఒకరినొకరు చంపుకునే స్థాయి వరకు వెళ్తున్నారు. తాజాగా ఇదే విషయం పై ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..?

వైవాహిక జీవితంలో వివాహేతర సంబంధలు చిచ్చుపెడుతున్నాయి. పచ్చని కాపురాలు కూడా ఈ అక్రమసంబంధం వల్ల నిలువున కూలిపోతున్నాయి. ఏకాంగా భార్యభర్తలు ఒకరినొకరు చంపుకునే స్థాయి వరకు వెళ్తున్నారు. తాజాగా ఇదే విషయం పై ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..?

  • Published Jan 02, 2024 | 5:04 PMUpdated Jan 02, 2024 | 5:04 PM
ఛత్తీస్‌గఢ్‌లో:భార్యపై అనుమానంతో భర్త దారుణం.. అర్ధరాత్రి నిద్రలోనే!

ప్రతిఒక్కరికి దాంపత్య జీవితం ఎంతో అపూరపమైనది. మూడు మూళ్లు.. ఏడు అడుగులతో ఆగ్ని సాక్షిగా ఒకటైన జంట నిండు నూరేళ్లు పిల్ల పాపలతో సుఖంగా జీవించాలని పెద్దలు దీవిస్తారు. అయితే ప్రస్తుతం కాలంలో మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలతో కొట్టుకోవడం, చంపుకోవడం, చివరికి విడాకులు తీసుకొని విడిపోవడం అనేది ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో అక్రమసంబంధం వల్ల పచ్చని కాపురాలు కూలిపోతున్నాయి. ఏకంగా భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకునే స్థాయి వరకు వెళ్తున్నాయి. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను, పిల్లలను అతి కిరాతకంగా చంపాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

వైవాహిక బంధంలో అనుమానం ఒక పెద్ద పెనుభూతమై పచ్చని కాపురాల్లో చిచ్చు పెట్టింది. చివరికి కట్టుకున్న భార్యతో సహ రక్తపంచుకున్న పిల్లలను కూడా బలి తీసుకుంది. బిలాస్‌పూర్ జిల్లా మస్తూరి పోలీస్ స్టేషన్ పరిధిలోని హిర్రీ గ్రామానికి చెందిన ఉమేంద్ర కేవత్ అనే 34ఏళ్ల వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలను అతి కిరాతకంగా గొంతుకోసి హత్య చేశాడు. ఇంతటి దారుణమైన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిలాస్‌పూర్ లోని హరి గ్రామనికి చెందిన ఉమేంద్ర కేవత్ తన భార్య వేరోకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఆమె నిద్రిస్తండగా.. గొంతు కోసి హత్య చేశాడు. ఈ క్రమంలోనే తన ముగ్గురు పిల్లలను ఆ దుర్మార్గుడు గొంతు కోసి హత్య చేశాడు.

అయితే భార్య మీద కోపంతో.. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డలపై కనీసం మానవత్వం లేకండా ఒక మృగంలా ప్రవర్తించాడు. ఈ దారుణమైన ఘటన చూసి స్థానికులంతా నివ్వేరపోయారు. కాగా, నిందుతుడు తన భార్యకు అక్రమ సంబంధాలున్నాయని అనుమానించేవాడు, తరుచు ఇదే విషయం పై భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇక వీరి వివాదంపై పలుమార్లు కుటుంబ పెద్దలు వరకు వెళ్లిందని, వాళ్లంతా ఒకటి రెండు సార్లు సమావేశమయ్యి నచ్చజేప్పరని తెలుస్తోంది. కాగా, మళ్లీ అదే విషయం పై వీరిద్దరి మధ్య సోమవారం వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఇక ఈ వివాదం తీవ్రస్థాయికి చేరడంతో ఆ నిచుడు భార్యను, ముగ్గురు చిన్నారులను అతి కిరాతకంగా హతమార్చాడు. మరి, భార్య పై అనుమానంతో ఆ పసి ప్రాణాలను బలిగొన్న కసాయి తండ్రి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

 

 

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Girişjojobetcasibom girişholiganbet giriş