iDreamPost
android-app
ios-app

అతనికి ఇద్దరు ప్రియురాళ్లు! అయినా సరిపోక ట్విస్ట్ ఇచ్చిన ముద్దుల ప్రియుడు!

  • Published Jul 15, 2024 | 1:43 PM Updated Updated Jul 15, 2024 | 1:43 PM

బీహార్ నుండి పని కోసం బెంగళూరుకు వచ్చాడు సోను. ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కానీ బాగా డబ్బు సంపాదించాలన్న కోరిక. దీంతో మాటలనే పెట్టుబడిగా చేసుకుని అమ్మాయిలను, మహిళల్ని ట్రాప్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా..

బీహార్ నుండి పని కోసం బెంగళూరుకు వచ్చాడు సోను. ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కానీ బాగా డబ్బు సంపాదించాలన్న కోరిక. దీంతో మాటలనే పెట్టుబడిగా చేసుకుని అమ్మాయిలను, మహిళల్ని ట్రాప్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా..

  • Published Jul 15, 2024 | 1:43 PMUpdated Jul 15, 2024 | 1:43 PM
అతనికి ఇద్దరు ప్రియురాళ్లు! అయినా సరిపోక ట్విస్ట్ ఇచ్చిన ముద్దుల ప్రియుడు!

అందమైన, డబ్బున్న మహిళలు, యువతులే అతడి టార్గెట్. మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకుంటాడు. సినిమా రేంజ్ స్టోరీలు చెప్పడంలో డైరెక్టర్లను మించిపోతాడు. మంచోడు అన్న పర్యాయపదానికి తానే అన్నట్లుగా జీవించేస్తాడు. ఆస్కార్ లెవల్ యాక్టింగ్ అతడిది. ప్రేమించిన యువతులు, మహిళలకు కల్లబొల్లి కబుర్లు చెబుతుంటాడు. తన ప్రేమ మైకంలో పడిపోయేట్లు చేస్తాడు. దీంతో అతడ్ని నమ్మి డబ్బు, నగలు మాత్రమే కాదు శరీరాన్ని కూడా అప్పగించేస్తుంటారు అమ్మాయిలు. ఇక అతడి మాయలో పడ్డారంటే.. హాం ఫట్ స్వాహా కావాల్సిందే. మెల్లిగా అన్ని దోచుకుని, మరో మహిళనో, యువతికో వల విసురుతాడు. అలా ఇద్దరు మహిళల్ని మోసం చేసి మూడో అమ్మాయితో పరారయ్యాడు ఓ కేటుగాడు.

ఇద్దరు మహిళలతో సహజీవనం చేసిన యువకుడు.. వారిద్దరి కాదని మూడో అమ్మాయితో పరారైన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. బీహార్ నివాసి అయిన సోను కుమార్ పని వెతుక్కుంటూ బెంగళూరుకు వచ్చాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పీణ్య సమీపంలోని నేలకతరనహళ్లిలో నివాసం ఉంటున్నాడు. అయితే ఇతడికి పెళ్లి కాలేదు.  సమీపంలోని ఓ మహిళకు మాయమాటలు చెప్పి.. లొంగదీసుకున్నాడు. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్ల పాటు మహిళతో సహజీవనం చేసిన అతడు.. కొంత కాలంగా ఆమెను దూరం పెట్టసాగాడు. అంతలో పీణ్యకు చెందిన మరో యువతితో పరిచయం ఏర్పరుచుకున్నాడు. ఆమెతో కలిసి ‘లివింగ్ టు గెదర్’ తరహాలో పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేశాడు.

ఆ మహిళను కూడా త్వరలో పెళ్లి చేసుకుందామని చెప్పి.. ఆమె వద్ద నుండి రూ. 3.60 లక్షలు దోచుకున్నాడు. అంతలో కుసుమ అనే యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆమెకు లేని పోనీ మాయమాటలు చెప్పి.. దూరంగా తీసుకెళ్లాడు. ఆమెను వివాహం చేసుకున్నాడు.  ఆ ఫోటోలను బంధువులకు పంపాడు సోను కుమార్. అంతలో బాధితురాలు.. ప్రియుడు తన డబ్బులు తీసుకుని పరారయ్యాడని పోలీసులను ఆశ్రయించింది. అప్పుడు కానీ తెలియలేదు.. అతడో పెద్ద ఆటగాడని, తననే కాదు తన కన్నా ముందే ఓ మహిళ మోస పోయిందని, ఇప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని.  బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో తీగ లాగితే డొంక కదిలిన చందంగా అతడి వ్యవహారం బయటకు వచ్చింది.  మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పుడు నిందితుడు సోను కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio