Telangana: పోయింది రూ.15 లక్షలు.. దొరికింది మాత్రం రూ.2 కోట్లు.. ట్విస్ట్ ఏంటంటే?

Big Twist In GhatKesar Burglary Case: ఒక్కోసారి చోరీ కేసులు పోలీసులను కూడా ఆశ్చర్యపోయేలా చేస్తూ ఉంటాయి. ఈ కేసు కూడా అలాంటి కోవకు చెందిందే. ఎందుకంటే రూ.15 లక్షలు పోయాయి అని ఫిర్యాదు చేస్తే.. రూ.2 కోట్లు దొరకడం కాస్త విడ్డూరంగానే ఉంది.

Big Twist In GhatKesar Burglary Case: ఒక్కోసారి చోరీ కేసులు పోలీసులను కూడా ఆశ్చర్యపోయేలా చేస్తూ ఉంటాయి. ఈ కేసు కూడా అలాంటి కోవకు చెందిందే. ఎందుకంటే రూ.15 లక్షలు పోయాయి అని ఫిర్యాదు చేస్తే.. రూ.2 కోట్లు దొరకడం కాస్త విడ్డూరంగానే ఉంది.

ఇళ్లల్లో చోరీలు జరగడం నగదు పోవడం సాధారణంగానే చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు పోయిన నగదు దొరుకుతుంది. కొంతమంది మాత్రం ఆ నగదును దాదాపుగా మర్చిపోవాల్సిందే అనుకుంటారు. ఇక్కడ మాత్రం పోయిన సొమ్ము మాత్రమే కాదండోయ్.. అందుకు 10 రెట్లు అదనంగా దొరికేసింది. ఈ మాట వినగానే అంతా ఆయనకు ఎక్కడో సుడి ఉందయ్య అంటున్నారు. అయితే ఈ మొత్తం తతంగంలో ఒక పెద్ద ట్విస్టు కూడా ఉంది. అది అలాంటి ఇలాంటి ట్విస్టు కాదు.. పోకిరిని కూడా మించి పోతుంది. ఈ బాధితుడి అదృష్టాన్ని ఎంత పొగిడినా తక్కువే. ఎందుకంటే పోగొట్టుకున్నాయన రూ.15 లక్షలు అంటే.. తస్కరించిన దొంగ గారు మాత్రం రూ.2 కోట్లు అని లెక్క చెప్తున్నాడు. అసలు ఈ దొంగా దొరల కథ ఏంటి?.. ఈ కేసును ఛేదించిన పోలీసులు ఏం చెప్తున్నారో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ వింత చోరీ ఈ నెల 22న ఘట్ కేసర్ శివారులో జరిగింది. పోచారం పోలీస్ స్టేషన్ పరిధి మక్త గ్రామంలో నాగ భూషణం పెద్ద పాల వ్యాపారి. ఆయన ఇంట్లోనే ఈ చోరీ జరిగింది. మొదట ఈ చోరీ జరిగిన రోజు నాగ భూషణం పోలీసులను ఆశ్రయించలేదు. కానీ, మరుసటి రోజు మాత్రం పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తన ఇంట్లో రూ.15 లక్షల నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశాడు. చోరీ కేసు రాగానే పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎందుకంటే చోరీ జరిగిన తర్వాత.. ఎంత త్వరగా కనుక్కుంటే అంత ఎక్కువ మొత్తంలో రికవరీ చేసేందుకు ఆస్కారం ఉంటుంది.

నాగభూషణం ఇంటి ప్రాంగణంలో ఒక ఆటో కదలికలు పోలీసులకు అనుమానం రేకెత్తించాయి. ఆ ఆటో నంబరు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం రెండు వందలకుపైగా సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. చివరకు ఒక ముగ్గురి ఆచూకీ లభించింది. ఆటో నంబరు ఆధారంగా వివరాలు సేకరించి.. పవన్- మహేశ్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీళ్లిద్దరు నాగ భూషణం డ్రైవర్ రవికి స్నేహితులుగా గుర్తించారు. రవి సూచనలు, ప్రణాళిక మేరకే ఈ చోరీ చేసినట్లు అంగీకరించారు. నాగ భూషణం ఇంట్లోలేని సమయం చూసి రవి చెప్పినందుకే ఈ చోరీ చేసినట్లు తెలుస్తోంది. వీళ్లందరికీ మరో నలుగురు సహకరించినట్లు గుర్తించారు.

పోలీసులు ఆ నలుగురిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అయితే ఈ చోరీలో అతి పెద్ద ట్విస్టు ఏంటంటే.. ఫిర్యాదు చేసింది రూ.15 లక్షల నగదు పోయింది అని. కానీ, పోలీసులకు దొంగలు చెప్పిన వివరాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. దొంగల్లో ఒకరు రూ.2 కోట్లు నగదు ఉన్నట్లు చెప్పారంట. మరో దొంగ మాత్రం రూ.1.7 కోట్లు ఉన్నట్లు వెల్లడించాడంట. మొత్తంగా నాగ భూషణం ఇంట్లో రూ.2 కోట్ల నగదు, 28 తులాల బంగారం చోరీకు గురైనట్లుగా భావిస్తున్నారు. నాగ భూషణం మాత్రం ఎందుకు రూ.15 లక్షలు మాత్రమే అని ఫిర్యాదు చేశాడు అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు అపహరణకు గురైన నగదు ఎక్కడ ఉంది? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Show comments