iDreamPost
android-app
ios-app

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. నాలుగేళ్లు తిరిగేసరికి..!

  • Published Oct 05, 2023 | 6:54 PM Updated Updated Oct 05, 2023 | 6:54 PM
  • Published Oct 05, 2023 | 6:54 PMUpdated Oct 05, 2023 | 6:54 PM
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. నాలుగేళ్లు తిరిగేసరికి..!

కృష్ణ, రమ్య ఇద్దరు భార్యాభర్తలు. వీళ్లు గతంలో ప్రేమించుకున్నారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అనుకున్నట్లే వివాహం చేసుకున్నారు. కాగా, పెళ్లైన కొన్ని రోజుల పాటు ఈ దంపతులు సంతోషంగానే సంసారాన్ని కొనసాగించారు. ఇరువురి తల్లిదండ్రులు కూడా సంతోషించారు. కట్ చేస్తే.. వీరి పెళ్లై నాలుగేళ్లు గడిచిందో లేదో.. తాజాగా ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలోని మద్దిరామమ్మ గుడి సెంటర్ లో ఎర్రం కృష్ణ (22), రమ్య (20) దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లిద్దరూ గత నాలుగు ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి భర్త కృష్ణ స్థానికంగా మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇదిలా ఉంటే.. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఈ భార్యాభర్తలు అనుమానాస్పదస్థితిలో శవాలై కనిపించారు. ఇంట్లో రమ్య బల్లపై విగతజీవిగా పడి ఉండగా, కృష్ణ మాత్రం ఫ్యాను ఉరి తాడుకు వేలాడుతూ కనిపించాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమచారం అందించారు.

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ దంపతులు ఇద్దరు తరుచు గొడవ పడేవారని, ఈ క్రమంలోనే క్రిష్ణ భార్యను హత్య చేసి.., ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş