iDreamPost
android-app
ios-app

విషాదం: లిఫ్ట్ గుంతలో పడి 10వ తరగతి బాలిక మృతి!

  • Published Jul 22, 2023 | 9:18 PM Updated Updated Jul 22, 2023 | 9:18 PM
  • Published Jul 22, 2023 | 9:18 PMUpdated Jul 22, 2023 | 9:18 PM
విషాదం: లిఫ్ట్ గుంతలో పడి 10వ తరగతి బాలిక మృతి!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ కోసం తీసి వదిలేసిన గుంతలో పడి ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో ఆ బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేటకు చెందిన తోకల హర్షిత (14) జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విద్యార్థులు స్కూల్ కు వెళ్లడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం స్కూల్స్ కు వరుస సెలవులు ప్రకటించింది. స్కూల్ లేకపోవడంతో శనివారం ఉదయం హర్షిత తన తోటి స్నేహితులతో కలిసి ఆడుకుంది. ఈ క్రమంలోనే హర్షిత ప్రమాదవశాత్తు వారి ఇంటి సమీపంలో లిఫ్ట్ కోసం తీసిన మూడు అంతస్తుల గుంతలో పడిపోయింది. హర్షిత అరుపులు విని ఆమె కుంటుంబ సభ్యులు వెంటనే అక్కడికి పరుగెత్తారు.

గుంతలో పడిపోయిన ఆ బాలికను అతి కష్టంగా బయటకు తీశారు. ఇక తీవ్రంగా గాయపడిన ఆ బాలికను ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆ బాలిక అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. కుమార్తె చనిపోవడంతో ఆమె తల్లిదండ్రులు , కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

ఇది కూడా చదవండి: నడి రోడ్డుపై బర్త్‌డే వేడుకలు.. ఆటో హారన్‌ కొట్టాడని..

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom