iDreamPost
android-app
ios-app

షాకింగ్: భర్త ఫోన్ ఎత్తలేదని ఆత్మహత్య చేసుకున్న భార్య!

  • Published Jul 10, 2023 | 11:16 AM Updated Updated Jul 10, 2023 | 11:16 AM
  • Published Jul 10, 2023 | 11:16 AMUpdated Jul 10, 2023 | 11:16 AM
షాకింగ్: భర్త ఫోన్ ఎత్తలేదని ఆత్మహత్య చేసుకున్న భార్య!

ఈ రోజుల్లో కొందరు భార్యలు ప్రతీ చిన్నదానికి భర్తతో గొడవ పడుతున్నారు. భర్త సినిమాకు తీసుకెళ్లలేదని, కొత్త చీర కొనివ్వలేదని, పుట్టింటికి తీసుకెళ్లలేదనే కారణాలతో భర్తతో గొడవ పడుతూ చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి. అచ్చం ఇలాంటి ఘటనే ఇటీవల మరొకటి వెలుగు చూసింది. భర్త ఫోన్ ఎత్తలేదని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరింగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం రైల్వే కాలనీలో భూక్యా నాగేశ్వరరావు-ప్రమీలా రాణి (29) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. భర్త రైల్వే లో ఎలక్ట్రీషన్ గా పని చేస్తున్నారు. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఓ కూతురు జన్మించింది. అలా చాలా కాలం పాటు ఈ దంపతుల సంసారం బాగానే సాగింది. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజుల నుంచి ఈ భార్యాభర్తలు తరుచు గొడవ పడుతున్నారు. ఇకపోతే.. శనివారం నాగేశ్వరరావు ఎప్పటిలాగే ఉద్యోగానికి వెళ్లాడు. అదే రోజు భార్య ప్రమీలా భర్తకు ఫోన్ చేసింది. అయితే, సిగ్నల్స్ కారణంగా ఫోన్ సరిగ్గా వినిపించకపోవడంతో భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ప్రమీలా తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇక భర్త ఇంటికి రాగానే ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదని భర్తతో గొడవకు దిగింది.

జరిగిన విషయాన్ని భర్త భార్యకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేశాడు. అయినా ప్రమీలా మాత్రం అస్సలు తగ్గలేదు. ఇదే విషయంపై ఇద్దరు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. అదే రోజు రాత్రి అందరూ నిద్రపోయాక ప్రమీలా ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారు జామున భర్త నిద్రలేచి చూసే సరికి భార్య ఉరికి వేలాడుతూ కనిపించింది. భార్యను అలా చూసి భర్త నాగేశ్వరావు షాక్ గురయ్యాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమీలా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibom