iDreamPost
android-app
ios-app

భద్రాచలంలో హనీట్రాప్! పలువురి మగాళ్లను ఆకర్షించి..!

  • Published Sep 27, 2023 | 4:20 PM Updated Updated Sep 27, 2023 | 4:20 PM
  • Published Sep 27, 2023 | 4:20 PMUpdated Sep 27, 2023 | 4:20 PM
భద్రాచలంలో హనీట్రాప్! పలువురి మగాళ్లను ఆకర్షించి..!

ఈ రోజుల్లో కొందరు వ్యక్తులు కష్టపడకుండా ఈజీగా డబ్బులు సంపాదించడం ఎలా అనే మార్గాలను వెతుకుతున్నారు. ఎవరిని ఇబ్బందులకు గురి చేయకుండా సంపాదిస్తే ఎలాంటి నష్టం లేదు. మోసాలను, అక్రమాలకు పాల్పడినే అసలు సమస్య. కానీ, తెలంగాణలోని ఓ ప్రాంతానికి చెందిన ఓ పెళ్లైన మహిళ మాత్రం మగాళ్లను ఆకర్షించి ఏకంగా ఇంటికి రప్పించుకుంటుంది. అంతే కాకుండా అత్యాచారం చేశావని నిన్ను జైలుకు పంపుతా అంటూ బెదిరింపులకు దిగుతూ డబ్బులు గుంజింది. ఇక అసలు విషయం బయటకు పొక్కడంతో చివరికి పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. భద్రాచలం పట్టణానికి చెందిన నాగమణి ( 35) అనే మహిళ డబ్బులు ఈజీగా సంపాదించడం ఎలా అని ఆలోచించింది. ఇందులో భాగంగానే ఈ పెళ్లైన మహిళ హనీట్రాప్ కు పాల్పడింది. తెలిసిన మగాళ్లతో తరుచు ఫోన్ లో మాట్లాడడం, ఆ తర్వాత వారిని ఆకర్షించి ఏకంగా ఇంటికి రప్పించుకోవడం చేసేది. ఇక ఇంతటితో సరిపెట్టకుండా.. వారితో మాట్లాడుతున్న సమయంలో వీడియోలు, ఫొటోలు తీసుకుని వాటితో వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ అందినకాడికి డబ్బులు డిమాండ్ చేస్తుంది. ఇవ్వనని ఎదురు తిరిగితే అత్యాచారం చేశావని పోలీసులకు చెప్పి జైలుకు పంపిస్తానంటూ బెదిరింపులకు దిగేది.

ఇలా ఎంతో మంది మగాళ్లు ఆమె మాయలో పడి మోసపోయారు. అయితే ఇదే జాబితాలో ఉన్న ఓ వ్యక్తి మాత్రం ఇటీవల దారుణానికి పాల్పడిన నాగమణిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగమణిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. కొందరు వ్యక్తులు మాత్రం.. 35 ఏళ్ల వయసులో ఇదేం గలీజ్ పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హనీ ట్రాప్ తో బ్లాక్ మెయిల్ కు దిగిన నాగమణి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom