iDreamPost
android-app
ios-app

దారుణం.. అర్థరాత్రి ఇంట్లో చొరబడి ప్రభుత్వ ఉద్యోగినిపై

  • Published Nov 05, 2023 | 3:53 PM Updated Updated Nov 05, 2023 | 3:53 PM

విధులు నిర్వహించుకుని ఇంటికి వచ్చి.. నిద్ర పోయిన ప్రభుత్వ ఉద్యోగిని తెల్లవారే సరికి రక్తపు మడుగులో పడి ఉన్నారు. అసలేం జరిగింది.. దారుణానికి పాల్పడింది ఎవరంటే..

విధులు నిర్వహించుకుని ఇంటికి వచ్చి.. నిద్ర పోయిన ప్రభుత్వ ఉద్యోగిని తెల్లవారే సరికి రక్తపు మడుగులో పడి ఉన్నారు. అసలేం జరిగింది.. దారుణానికి పాల్పడింది ఎవరంటే..

  • Published Nov 05, 2023 | 3:53 PMUpdated Nov 05, 2023 | 3:53 PM
దారుణం.. అర్థరాత్రి ఇంట్లో చొరబడి ప్రభుత్వ ఉద్యోగినిపై

సమాజంలో నేర ప్రవృత్తి రోజు రోజుకు పెరుగుతోంది. చిన్న చిన్న కారణాలకే దారుణాలకు తెగబడుతున్నారు కొందరు వ్యక్తులు. క్షణికావేశంలో జీవితాలను అంతం చేస్తున్నారు. ఇక ఆడవారి విషయంలో జరిగే దారుణాలకు హద్దు లేకుండా పోతుంది. అత్యాచారాలు, హత్యలు అంటూ ఆడవారిపై రాక్షస క్రీడ కొనసాగిస్తున్నారు. ఎంత కఠిన చట్టాలు తెచ్చినా.. ఎలాంటి శిక్షలు విధించినా నేరగాళ్లు మాత్రం మారడం లేదు. ఇక తాజాగా ఓ దారుణం చోటు చేసుకుంది. విధులు ముగించికుని ఇంటికి వచ్చిన ఓ ప్రభుత్వ ఉద్యోగినిని అత్యంత దారుణంగా హత్య చేశారు దుండగులు. అర్థ రాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించి.. సదరు ఉద్యోగనిని హత్య చేశారు. ఆ వివరాలు..

ఈ దారుణం బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ప్రతిమ(37) అనే మహిళ బెంగళూరులో మైన్స్ అండ్ ఎర్త్ సైన్సెస్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బెంగళూరులోని సుబ్రహ్మణ్యపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొడ్కకలసంద్ర లోని గోకుల అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి దాదాపు 8 గంటల ప్రాంతంలో విధులు ముగించికున్న తర్వాత.. డ్రైవర్‌ ఆఫీస్‌ నుంచి ప్రతిమను తీసుకువచ్చి.. ఇంటి వద్ద దింపి వెళ్లిపోయారు. ప్రతిమ ఒక్కరే ఇంట్లో ఉండగా అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి ఆమెను హత్య చేశారు.

ఆదివారం ఉదయం ప్రతిమ సోదరుడు ఆమెకు కాల్‌ చేశాడు. సార్లు ఫోన్ చేసిన ప్రతిమ స్పందించలేదు. దాంతో ఆదివారం ఉదయం ప్రతిమ సోదరుడు ఆమె ఇంటికి వచ్చి చూడగా ప్రతిమ రక్తం మడుగులో విగతజీవిగా పడివుంది. ఇది గమనించిన ప్రతిమ సోదరుడు.. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు. ఈ క్రమంలో సౌత్ డివిజన్ డీసీపీ రాహుల్ కుమార్ షాపూర్వాడ్ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ప్రతిమ ఇంట్లో ఎలాంటి ఆధారాలు కనిపించ లేదు. దాంతో తెలిసిన వాళ్లే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.​ కాగా ప్రతిమ కొన్నాళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్నారు. భర్త, కొడుకు తీర్థహళ్లిలో నివాసముంటున్నట్లు తెలిసింది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio