iDreamPost
android-app
ios-app

ఉప్మా తిని చచ్చిపోయిన పిల్లి, కుక్క.. అసలు విషయం తెలిసి అంతా షాక్‌!

  • Published Aug 19, 2023 | 9:36 AM Updated Updated Aug 19, 2023 | 9:36 AM
  • Published Aug 19, 2023 | 9:36 AMUpdated Aug 19, 2023 | 9:36 AM
ఉప్మా తిని చచ్చిపోయిన పిల్లి, కుక్క.. అసలు విషయం తెలిసి అంతా షాక్‌!

సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటల్ని చూస్తుంటే.. మనుషుల మధ్య ప్రేమానురాగాలు పూర్తిగా నశించిపోయాయని అనిపిస్తోంది. ఆస్తికోసం కట్టుకున్న వాళ్లను.. కన్న వాళ్లను, తోబుట్టువులను కూడా చంపుతున్న సంఘటనలు బాగా పెరిగిపోయాయి. తాజాగా, ఓ మహిళ రెండెకరాల పొలం కోసం భర్తను చంపడానికి యత్నించింది. తినే తిండిలో విషం పెట్టింది. ఆ తిండి తిన్న అతడు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా.. పిల్లి, కుక్క మృత్యువాతపడ్డాయి. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక, బెళగావి జిల్లా, సవదత్త తాలూకాలోని గూరబాళకు చెందిన నింగప్ప, సేవక్క భార్యాభర్తలు. వీరికి పెళ్లయి దాదాపు 10 ఏళ్లు అవుతోంది. గత కొన్ని నెలల నుంచి రెండెకరాల పొలం విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె సోదరుడు ఆమెకు భర్తపై లేని పోనివి నూరిపోశాడు. భర్తను చంపేస్తే ఆస్తి నీకే దక్కుతుందని చెప్పాడు. సేవక్క అతడి మాటలు గుడ్డిగా నమ్మింది. భర్తను చంపటానికి సిద్ధమైంది. పథకం ప్రకారం నింగప్ప తినే ఉప్మాలో విషం కలిపింది. ఉప్మాలో విషం ఉందన్న సంగతి తెలియని నింగప్ప.. కడుపునిండా దాన్ని తిన్నాడు. అతడితో పాటు ఇంట్లోని కుక్క, పిల్లి కూడా దాన్ని తిన్నాయి.

తిన్న కొద్దిసేపటికి నింగప్ప తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడికి అత్యవసర చికిత్స అందించారు. వైద్య పరీక్షల్లో అతడు తినే తిండిలో విషం ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఇక, ఉప్మా తిన్న కుక్క, పిల్లి చనిపోయాయి. ఈ సంఘటనపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో సేవక్క ఉప్మాలో విషం కలిపినట్లు తేలింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరి, ఆస్తి కోసం భర్తను చంపటానికి ప్రయత్నించిన సేవక్కపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetmatbetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş