iDreamPost
android-app
ios-app

ఒళ్లు గగుర్పొడిచే దారుణం.. యువతిని చంపి 32 ముక్కలు చేసి.. అసలు ఏం జరిగిందంటే?

  • Published Sep 21, 2024 | 9:46 PM Updated Updated Sep 21, 2024 | 9:46 PM

Bangalore: బెంగళూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువతిని దారుణంగా అంతమొందించాడు ఓవ్యక్తి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. అసలు ఏం జరిగిందంటే?

Bangalore: బెంగళూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువతిని దారుణంగా అంతమొందించాడు ఓవ్యక్తి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. అసలు ఏం జరిగిందంటే?

  • Published Sep 21, 2024 | 9:46 PMUpdated Sep 21, 2024 | 9:46 PM
ఒళ్లు గగుర్పొడిచే దారుణం.. యువతిని చంపి 32 ముక్కలు చేసి.. అసలు ఏం జరిగిందంటే?

ఇటీవల మహిళలపై దారుణాలు ఎక్కువై పోతున్నాయి. ప్రేమ పేరుతో, అనుమానంతో మహిళలను, యువతులను పొట్టనబెట్టుకుంటున్నారు కొందరు వ్యక్తులు. ప్రేమించిన అమ్మాయి దక్కకుండా పోతుందన్న అక్కసుతో ప్రాణాలను తీస్తున్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను తీసుకొస్తున్నప్పటికీ అఘాయిత్యాలకు అడ్డుకట్టపడడం లేదు. నిన్న(శుక్రవారం) ఓ 90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఓ యువతని చంపి ఏకంగా 32 ముక్కలు చేశాడు ఓ దుర్మార్గుడు. ఆ తర్వాత ఆమె శరీర భాగాలను ఫ్రిజ్ లో దాచాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. గతంలో ఢిల్లీలో ఓ శ్రద్దావాకర్ అనే యువతిని ఆమె ప్రియుడు చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ముక్కలు ముక్కులుగా నరికి శరీర భాగాలను అడవుల్లో విసిరేశాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఇదే తరహా ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ కుటుంబం మూడు నెలల క్రితమే నగరంలోని వాయాలికావల్ పైప్ లైన్ రోడ్డులోని వీరన్న భవన్ సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు దిగినట్లు తెలిపారు. భర్తతో విడిగా ఉంటున్న ఆ యువతిని ఓ వ్యక్తి హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఈ హత్య 15 రోజుల క్రితం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

గత కొన్ని రోజులుగా ఆ ఇంట్లోంచి దుర్వాసన వస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆమె ఇంట్లో రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన మృతదేహాన్ని కనుగొన్నారు. 29 ఏళ్ల మహిళను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని 32 ముక్కలుగా చేసి ఫ్రిజ్ లో ఉంచారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతి చెందిన మహిళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మహాలక్ష్మిగా గుర్తించారు. హత్యకు అక్రమ సంబంధాలు కారణమా? లేక ఆర్థికపరమైన అంశాలున్నాయా? అని పలు కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. యువతిని చంపి 32 ముక్కలు చేసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio