Vizianagaram-6 Month Old Baby Crime News: విజయనగరం: అత్యంత దారుణం.. 6 నెలల చిన్నారిపై తాత అత్యాచారం

విజయనగరం: అత్యంత దారుణం.. 6 నెలల చిన్నారిపై తాత అత్యాచారం

Vizianagaram-6 Month Old Baby Crime news: ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. ఊయలలో ఆడుకుంటున్న ఆరు నెలల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ వివరాలు..

Vizianagaram-6 Month Old Baby Crime news: ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. ఊయలలో ఆడుకుంటున్న ఆరు నెలల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ వివరాలు..

సమాజంలో చోటు చేసుకుంటున్న కొన్ని దారుణాలు చూస్తే.. మనం మనుషుల మధ్యే ఉంటున్నామా.. లేక ఏదైనా ఆటవిక రాజ్యంలో ఉన్నామా అర్థం కావడం లేదు. నాలుగు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లాలో 8 ఏళ్ల బాలికపై.. ముగ్గురు మైనర్‌ బాలురు అత్యాచారం చేసి.. ఆపై దారుణంగా హత్య చేశారు. నిందితులు ముగ్గురి వయసు 13 ఏళ్ల లోపే ఉండటం గమనార్హం. ఇప్పటికి కూడా బాధిత బాలిక మృతదేహం లభ్యం కాలేదు. పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్నారు మైనర్‌ బాలురు. ఈ దారుణ సంఘటనను మరువక ముందే.. అత్యంత నీచమైన, హేయమైన సంఘటన వెలుగు చూసింది. తల్లి పాలు తాగి.. ఊయలలో సేదదీరుతున్న ఆరు నెలల పసిగుడ్డుపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. అది కూడా తాత వరుసైన వ్యక్తి ఇంతటి దారుణానికి పాల్పడటం సంచలనంగా మారింది. ఆ వివరాలు..

మహిళలు, చిన్నారులపై అత్యాచార ఘటనలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలను అమల్లోకి తెచ్చినా లాభం లేకుండా పోతుంది. ఆఖరికి ముక్కుపచ్చలారని పసికందులను సైతం వదలడం లేదు. పశువుల కన్నా దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌, విజయనగరం జిల్లాలో ఊయలలో ఉన్న ఆరు నెలల చిన్నారిపై.. తాత వరుసయ్యే వ్యక్తి.. దారుణానికి ఒడిగట్టిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన విజయనగరం జిల్లా, రామభద్రాపురం మండలంలో శనివారం నాడు చోటు చేసుకుంది. చిన్నారిని ఊయలలో వేసిన ఆమె తల్లి.. సరుకుల కోసం దగ్గర్లో ఉన్న కిరాణా దుకాణానికి వెళ్లింది.

ఇక ఇదే సమయంలో గ్రామంలో ఉంటున్న నార్లవలస గ్రామానికి చెందిన బోయిన ఎరకన్న దొర అనే వ్యక్తి.. ఆ చిన్నారి ఇంట్లో ఎవరూ లేరని గుర్తించి లోపలికి చొరబడ్డాడు. అనంతరం ఊయలలో ఆడుకుంటున్న ఆ చిన్నారిని బయటకు తీసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ చిన్నారి గట్టిగా ఏడ్చింది. ఆ ఏడుపు విన్న చిన్నారి అక్క.. పరిగెత్తుకుంటూ వెళ్లి తన తల్లికి విషయం చెప్పింది. విషయం తెలియడంతో తల్లితో పాటు.. గ్రామస్తులు చిన్నారి ఇంటి వద్దకు చేరుకుని.. నిందితుడిని పట్టుకునేందుకు వెంబడించగా అతడు పరారయ్యాడు.

అనంతరం చిన్నారిని బాడంగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విజయనగరంలోని ఘోష ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. డీఎస్పీ శ్రీనివాసరావు ఆ గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం నార్లవలస వెళ్లి నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

Show comments